- మా ఆవేదన దేశమంతా తెలిసేలా నిరసన వ్యక్తం చేస్తాం
- కేంద్రం కొంటామనే వరకు పోరాడుతూనే ఉంటాం
- మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: వానాకాలంలో పండిన ప్రతి గింజ కొనాల్సిందేనని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పునరుద్ఘాటించారు. రాజ్యాంగ హక్కు ప్రకారం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల అవసరాలకు పోను.. మిగిలిన బియ్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన గుర్తు చేశారు. కేంద్రం మాటమారుస్తోంది కాబట్టే నమ్మకం లేకనే రాతపూర్వకంగా బియ్యం కొంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇవ్వాలన్నారు. పండిన ప్రతిగింజను కూడా కొనాల్సిందేనని మంత్రి గంగుల స్పష్టం చేశారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన కోసం రెండు రోజులపాటు మా మంత్రుల బృందం ఢిల్లీలో వెళ్లి ప్రయత్నాలు చేసిందన్నారు. కేంద్రం దిగివచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని.. అవసరమైతే ధాన్యం బస్తాలను ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద పోసి నిరసన తెలియజేస్తామని.. దేశమంతా మా ఆవేదన తెలిసేలా చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి:
పిల్లలకు వ్యాక్సిన్ మంచిదే కానీ ఎప్పట్లో ఇస్తారు ?
బీజేపీ వైఫల్యాలపై కేటీఆర్ బహిరంగ లేఖ
బదిలీ అయిన గన్ మెన్లకు ఘనంగా వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే