
స్టాక్ మార్కెట్ అంతా నష్టాల్లో ఉన్న టైమ్ లో ఒక చిన్న కంపెనీ ప్రతి రోజు అప్పర్ సర్క్యూట్ కొడుతూ.. వన్ వీక్ లోనే 35 శాతం పెరుగి ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించింది. బ్యాక్ టు బ్యాక్ అప్పర్ సర్క్యూట్ కొడుతుండంతో ఈ స్టాక్ ను పోర్ట్ ఫోలియోలో యాడ్ చేసుకునేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. దీంతో ఇప్పుడు మార్కెట్ దృష్టి ఈ స్మాల్ క్యాప్ కంపెనీపై పడింది. ఇంత బేర్ మార్కె్ట్ లో.. కోట్ల సంపద ఆవిరవుతున్న టైమ్ లో ఇంత రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ పేరు.. సెంచరీ ఎంకా లిమిటెడ్ (Century EnkaLtd).
వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో ట్రేడ్ అయిన ఈ స్టాక్.. మంగళవారం (ఫిబ్రవరి 25) ఒక్కరేజే 8% పెరిగీ బీఎస్ఈలో రూ.595 కి చేరుకుంది. అంటే గత వారంలో 441 దగ్గరు ఉన్న షేర్ వాల్యూ మంగళవారం సెషన్ ఎండింగ్ వరకు 595 రూపాయల వద్ద క్లోజ్ అయ్యింది. గత వారం రోజుల్లోనే 35 శాతం పెరగిన ఈ కంపెనీ.. గత రెండు నెలల్లో 38 శాతానికి పడిపోయింది. 2024 డిసెంబర్ 16న రూ.735.65 దగ్గర ఉన్న స్టాక్ అప్పట్నుంచీ వరుసగా ఫాల్ అవతూ 38 శాతం పడిపోయింది. అయితే ఈ లాస్ అంతా కేవలం ఒక్క వారంలోనే రికవర్ అవ్వడంతో ఇన్వెస్టర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు.
సెంచరీ ఎంకా కంపెనీ గురించి:
సింథటిక్ యార్న్, దానితో ప్రొడక్స్ సెల్ చేసే సెంచరీ ఎంకా ప్రముఖ ఆదిత్యా బిర్లా గ్రూప్ కు చెందిన స్మాల్ క్యాప్ కంపెనీ. రూ.1305 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ స్మాల్ క్యాప్ నెదర్లాండ్స్ కు చెందిన అకార్డిస్ గ్రూప్ (Accordis group), ఆదిత్యా బిర్లా గ్రూప్ ల జాయింట్ వెంచర్ గా ప్రారంభమైంది. ఇండస్ట్రియల్, టెక్స్ టైల్ యార్న్ అండ్ ఫ్యాబ్రిక్స్(NTCF) ట్రక్స్, బస్సులు, త్రీవీలర్ మొదలైన టైర్ లలో వినియోగిస్తారు. ఎక్కువగా మైనింగ్, అడవులు, వ్యవసాయం మొదలైన హెవీ వర్క్స్ కు వాడే వెహికిల్స్ టైర్స్ లో NTCFను వినియోగిస్తారు.
అదే విధంగా ఈ కంపెనీ నైలాన్ ఫిలమెంట్ యార్న్ (NFY) ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో ఇప్పుడు ఈ NFY యార్న్ కు డిమాండ్ పెరగడంతో కంపెనీ టాక్ ఆఫ్ ది మార్కెట్ గా నిలిచింది. స్పోర్ట్స్, అథ్లెట్స్ తో పాటు డిఫెన్స్ ఫ్యాబ్రిక్స్ కు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కంపెనీ షేర్లపై మార్కెట్ ఆసక్తి చూపుతోంది.
ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి:
కంపెనీ క్వార్టర్3 పైనాన్షియల్ ఇయర్ (Q3F25) 2025కి రూ.493 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇయర్ ఆన్ ఇయర్ (Y-o-Y) లో 9.5 శాతం వృద్ధి సాధించింది. (Y-o-Y) ఎబిటా 48 శాతం పెరగడం గుడ్ సైన్ గా భావించవచ్చు. ఎబిటా మార్జిన్స్ 143 బేసిస్ పాయింట్స్ పెరిగి 5.51 శాతానికి పెరిగాయి. గత ఏడాది 4.08గా ఉన్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ (PAT) ఒకేసారి 4.7 కోట్ల నుంచి రూ.14 కోట్లకు చేరుకోవడం విశేషం.
టైర్ కార్డ్ ఫ్యాబ్రిక్ రెవెన్యూ Y-o-Y 5 శాతం తగ్గితే.. ఫిలమెంట్ యార్న్ (NFY) రెవెన్యూ 23 శాతం పెరగింది. అదేవిధంగా అగ్రికల్చరల్ బేస్ యార్న్ కు కూడా మంచి డిమాండ్ ఉందని కంపెనీ చెబుతోంది. రా మెటీరియల్ ప్రైసెస్ పెరగడం, చైనా నుంచి దిగుమతుల వలన కొంత డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ ఫ్యూచర్లో అధిగమిస్తామని మేనేజ్ మెంట్ చెబుతోంది. కంపెనీ ప్రొడక్ట్స్ కు వస్తున్న డిమాండ్ తో.. ఫ్యూచర్ బాగుంటుంది అనే హోప్ తో కంపెనీలో ఇన్వెస్ట్ మెంట్లు పెరిగిపోయాయి. దీంతో వారం రోజుల్లోనే 35 శాతం పెరిగి మార్కెట్ ను అట్రాక్ట్ చేసింది ఈ కంపెనీ.
రిటైల్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ గురించి పూర్తిగా చదివి, ఎనలిస్ట్ ల సలహాలు తీసుకోడం మంచింది. వారంలో పెరిగింది కదా అని.. ఇంకా పెరుగుతుందనే గుడ్డి నమ్మకంతో కాకుండా.. కంపెనీ ఫ్యూచర్ ప్రాస్పె్క్ట్స్, ఫండమెంటల్స్ ను తెలుసోవడం మంచిది.