ఐఫోన్‌‌ స్టక్‌‌ అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ఐఫోన్‌‌ స్టక్‌‌ అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

 ఐ ఫోన్స్‌‌ అప్పుడప్పుడూ స్టక్‌‌ అవుతుంటాయి. స్క్రీన్‌‌పై యాపిల్‌‌ లోగో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు టర్న్‌‌ ఆఫ్‌‌ అయిపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్‌‌ ఆన్‌‌ అవ్వకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్‌‌ ఫిక్స్‌‌ చేసుకోవాలంటే కొన్ని మెథడ్స్‌‌ ఉన్నాయంటున్నారు టెక్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఈ ప్రాబ్లమ్‌‌ ఎదురైతే, ఈ టిప్స్‌‌ ఫాలో అవ్వండి.

ఎందుకు?

ఐఫోన్‌‌ స్టక్‌‌ అయ్యేందుకు చాలా రీజన్స్‌‌ ఉన్నాయి. ఫోన్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కరప్ట్‌‌ అవ్వొచ్చు. డాటా ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసేటప్పుడు లేదా ఐఓఎస్‌‌ అప్‌‌డేట్‌‌ చేసి, ఇన్‌‌స్టాల్‌‌ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్‌‌ రావచ్చు. ఐక్లౌడ్‌‌ లేదా ఐట్యూన్స్‌‌ నుంచి కరప్టెడ్‌‌ ఫైల్స్‌‌ను రీస్టోర్‌‌‌‌ చేసినా లేదా ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసినా కూడా కొన్నిసార్లు ఫోన్‌‌ స్టక్‌‌ అవ్వొచ్చు. ఫోన్‌‌ ‘జైల్‌‌బ్రేక్‌‌’ అయినా, బూట్‌‌ లూప్‌‌ వంటి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇష్యూస్‌‌ వచ్చినా ఐఫోన్‌‌ స్టక్‌‌ అవ్వొచ్చు. ఫోన్ కిందపడ్డప్పుడు హార్డ్‌‌వేర్‌‌‌‌కు సంబంధించిన ఏవైనా ఇంటర్నల్‌‌ కాంపోనెంట్స్‌‌ దెబ్బతిన్నా ఈ ఇష్యూ వస్తుంది.

ఇలా చేసి చూడండి

ఫోన్‌‌ స్టక్‌‌ అయితే, ఫోర్స్‌‌ రీస్టార్ట్‌‌ చేసేందుకు ప్రయత్నించాలి. అయితే, ఇది ఒక్కో ఐఫోన్‌‌కు ఒక్కోలా ఉంటుంది. 6ఎస్‌‌, ఎస్‌‌ఈ (ఫస్ట్‌‌ జనరేషన్‌‌), అంతకంటే ముందు ఫోన్లపై హోమ్‌‌ బటన్‌‌ ప్రెస్‌‌ చేసి, హోల్డ్‌‌ చేస్తే స్లీప్‌‌/వేక్‌‌ అనే బటన్‌‌ కొన్ని సెకండ్లపాటు ప్రెస్‌‌ చేయాలి. యాపిల్‌‌ లోగో డిసప్పియర్‌‌‌‌ అయి, ఫోన్‌‌ స్టార్ట్‌‌ అవ్వొచ్చు.

  •   ఫోర్స్‌‌ రీస్టార్ట్‌‌ పనిచేయకపోతే, ‘ఐఓఎస్‌‌’ రీ ఇన్‌‌స్టాల్‌‌ చేయాలి. ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఫోన్‌‌ కరప్ట్‌‌ అవ్వొచ్చు. ఇలా కరప్ట్‌‌ అయితే, ఐఫోన్‌‌ను మ్యాక్‌‌బుక్‌‌కు కనెక్ట్‌‌ చేసి, ఫోర్స్‌‌ రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. స్క్రీన్‌‌పై కంప్యూటర్‌‌‌‌ ఐకాన్‌‌తో కూడిన రికవరీ మోడ్‌‌ ఆప్షన్‌‌ కనిపిస్తుంది. తర్వాత అప్‌‌డేట్‌‌ ఆర్‌‌‌‌ రీస్టోర్‌‌‌‌ అనే ఆప్షన్‌‌ కనిపిస్తుంది. ఇప్పుడు అప్‌‌డేట్‌‌ సెలక్ట్‌‌ చేసుకుని, ఐఓఎస్‌‌ రీ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవచ్చు.
  •   పై రెండు ఆప్షన్స్‌‌ పనిచేయకపోతే, సిస్టమ్‌‌ రిపైర్‌‌‌‌ ప్రోగ్రామ్స్ యూజ్‌‌ చేసుకోవచ్చు. ఇందులో పెయిడ్‌‌ అండ్ ఫ్రీ రెండు వేరియెంట్స్‌‌ ఉంటాయి. Fixppo, Dr. Fone, TunesKit, Tenorshare Reiboot, iMyFone, వంటి సర్వీసెస్‌‌ వాడి ఫోన్ రీస్టార్ట్ అయ్యేలా చేయొచ్చు.
  •   ఇవేవీ పనిచేయకపోతే, తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్‌‌ను ‘ఫ్యాక్టరీ రీస్టోర్‌‌‌‌’ చేయొచ్చు. అయితే, దీనివల్ల ఫోన్‌‌లోని డాటా మొత్తం ఎరేజ్‌‌ అవుతుంది. కానీ, ఒకవేళ మీ డాటా కంప్యూటర్‌‌‌‌ లేదా ఐక్లౌడ్‌‌తో లింక్‌‌ అయి ఉంటే, తర్వాత రికవర్‌‌‌‌ చేసుకోవచ్చు.
  •   డీఎఫ్‌‌యూ (డివైజ్‌‌ ఫర్మ్‌‌వేర్‌‌‌‌ అప్‌‌డేట్‌‌) అనేది ఐఫోన్స్‌‌లో ఉన్న హిడెన్‌‌ ఫీచర్‌‌‌‌. ఇది ఫోన్‌‌కు సంబంధించిన సీరియస్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇష్యూస్‌‌ను కూడా సాల్వ్‌‌ చేస్తుంది. ఇన్‌‌కంప్లీట్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను కొత్త కోడ్‌‌తో రీరైట్‌‌ చేస్తుంది. దీనికి యాపిల్‌‌ అప్రూవ్‌‌ చేసిన యూఎస్‌‌బీ కేబుల్‌‌ మాత్రమే వాడాలి. ఇది ఎక్స్‌‌పర్ట్స్‌‌ చేస్తేనే రిజల్ట్‌‌ బాగుంటుంది.