పోలీసు శాఖలో వణుకుపుట్టిస్తున్న సీపీ ప్రమోద్ కుమార్
వరంగల్: అధికారం ఉందని కొందరు పోలీస్ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహ రిస్తుంటారు. స్టేషన్ కు వస్తే చెప్పిందే వినాలి అంటూ హుకుం జారీ చేస్తారు. నిబంధనలు పక్కన పెట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడుతుంటారు. అలాంటి వారు కనిపిస్తే ఉన్నతాధికారులు మందలించి మెమోలు ఇచ్చి బదిలీలు చేయడం సాధారణం. అయితే వరంగల్ సీపీ మాత్రం తప్పు చేసిన పోలీస్ అధికారుల పై కొరడా ఝుళిపిస్తూ చర్యలు చేపడుతున్న వైనం పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రజా ప్రతినిధుల అండదండలతో భూ దందాలు,సెటిల్ మెంట్ చేస్తూ అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నపోలీస్ అధికారులపై నిఘా పెట్టి మరీ వేటు వేస్తున్నారు. తప్పిదాలకు పాల్పడు తున్న వారి పై చర్యలు చేపడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. ముగ్గురు సర్కిల్ ఇన్స్ పెక్టర్ ల పై చర్యలు చేపట్టడమే కాదూ… ప్రజలకు జవాబుదారి తనంగా పని చేయాలంటూ పోలీస్ శాఖలోని అధికారులను ప్రక్షాళన చేస్తున్నారు చేశారు వరంగల్ కమిషనర్ ప్రమోద్ కుమార్.
మూడు నెలల క్రింతం వరంగల్ ఇంచార్జి కమిషనర్ గా ప్రమోద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరిన నాటి నుండి కమిషనరేట్ లో ఏం జరుగుతుందో కనిపెడుతూ ప్రక్షాళన ప్రారంభించారు. అవీనీతి అధికారులు పద్ధతి మార్చుకోవాలని.. సివిల్ తగదాల్లో తల దూర్చవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొంత మంది సీఐలు, ఎస్సైలు భూ తగదాల్లో తల దూరుస్తూ సెంటిల్ మెంట్ చేస్తున్నట్లు తెలియడంతో అంతర్గత విచారణ చేపట్టారు. ముగ్గురు సీఐలతోపాటు, స్థాయి భేదం చూడకుండా పదుల సంఖ్యలో బదిలీలు చేసారు. ఏడుగురు కానిస్టేబుల్స్ పై ఏకంగా సస్పెన్ష్ వేటు వేసారు. మూడు నెలల కాలంలో ముగ్గురు సీఐల పై సీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం పోలీస్ శాఖలో సంచలనం సృష్టించింది. ఇద్దరు సీఐ లను సస్పెండ్ చేసిన, మరొకరిని అటాచ్ చేశారు.
హన్మకొండ సీఐ దయాకర్ భూ తగదాల్లో కొందరిని బెదింపులకు గురి చేసారని నిర్ధారించిన సీపీ ఈ సీఐ పై పని చేసిన పోలీస్ స్టేషన్ లోనే ఏకంగా కేసు నమోదు చేసారు. ఆయనను బదిలీ చేసి సస్పెండ్ చేశారు.
ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ సాదుల్లా బాబా గుట్కా పట్టుకుని డబ్బులు తీసుకుని వదిలేసారనే అరోపణలు వచ్చాయి. వీటికి తోడుగా భూ తగాదాలకు పాల్పడుతున్నందున అతన్ని మొదటి తప్పుకింద వీఆర్ కు అటాచ్ చేసారు.అ తరువాత సీఐడీకి బదిలీ చేశారు.
కమాలాపూర్ ఇన్ స్పెక్టర్ రవిరాజా భూ దందాలు,సివిల్ తగదాల్లో తలదూర్చుతూ, అవీనీతి అరోపనలు వచ్చిన నేపధ్యంలో సస్పెన్షన్ వేటు వేసారు. రవిరాజా ప్రతి పనికి రేటు చెబితే చెల్లించి పోవాల్సిందేనని భాదితులు సీపీకి ఫిర్యాదు చేసారు. ఆయన ఏరియాలో నెల వారిగా మామూళ్లు దండుకుంటున్నారని ఆరోపనలు వచ్చాయి.
వీరితో పాటుగా పదుల సంఖ్యలో ఎస్సైలను ట్రాన్స్ పర్ చేశారు. మరో ఏడుగురు పోలీస్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇలా తప్పు చేసిన వారు పోలీసు వారైనా సరే ఎ మాత్రం మినహాయింపు లేకుండా కఠిన చర్యలు చేపడుతుండటంతో పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. అవినీతి పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పీసీ ప్రమోద్ కుమార్ తీసుకుంటున్న చర్యలతో బాధితులు హర్షాతిరేకాలు చేస్తున్నారు.