అమెరికా ఎన్నికల్లో క్లీయర్​ రిజల్ట్​ రాకుంటే.. కోర్టు డెసిషనే కీలకం!

అమెరికా ఎన్నికల్లో క్లీయర్​ రిజల్ట్​ రాకుంటే.. కోర్టు డెసిషనే కీలకం!

ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్​లో టైట్​ఫైట్​పై ఉత్కంఠ

రీకౌంటింగ్, పోస్టల్​ బ్యాలెట్లపై గొడవలు కోర్టుకెళ్లే చాన్స్

20 ఏండ్ల కిందటి ఎలక్షన్​లో ఇదే తరహా సిచ్యువేషన్

రీకౌంటింగ్​ ఆపి రిజల్ట్​ ప్రకటించాలన్న సుప్రీంకోర్టు

జార్జ్​బుష్​కు కలసివచ్చి ప్రెసిడెంట్​ అయిన తీరు

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్​ ఎలక్షన్ల రిజల్ట్ పై అంతటా ఉత్కంఠ నెలకొంది. టైట్​గా జరుగుతున్న పోటీలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకున్నా, ఓట్ల శాతంలో అతితక్కువ తేడా ఉన్నా వ్యవహారం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అత్యంత భారీగా నమోదైన పోస్టల్​ బ్యాలెట్(మెయిల్​ఇన్) ఓట్లు, వాటి లెక్కింపు కోసం చాలా టైం తీసుకునే అవకాశం ఉండటం, రీకౌంటింగ్​కు డిమాండ్లు వంటి అంశాల్లో అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయమే కీలకంగా మారే చాన్స్​ ఉంది. ఇప్పటికే పోస్టల్​ బ్యాలెట్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ.. అమెరికాలోని స్టేట్​ కోర్టులు, ఫెడరల్​ కోర్టుల్లో 400కుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటికితోడు ఓట్ల రీకౌంటింగ్, పోస్టల్​ బ్యాలెట్ ఓట్లపై ప్రెసిడెంట్​ క్యాండిడేట్లు ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళితే ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇంతకుముందు 20 ఏండ్ల కింద 2000వ సంవత్సరంలో జరిగిన ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్లలో ఈ పరిస్థితి ఏర్పడింది.

36 రోజులు సాగి..

2000వ సంవత్సరంలో జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్లు ఆ దేశ చరిత్రలో రికార్డుగా నిలిచిపోయాయి. పోలింగ్​ జరిగిన తర్వాత రీకౌంటింగ్​లు, కోర్టుల్లో పిటిషన్లు, విచారణల కారణంగా.. ప్రెసిడెంట్​ ఎవరో తేలడానికి ఏకంగా 36 రోజులు పట్టింది. చివరికి అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయంతోనే ప్రెసిడెంట్​ ఎవరో తేల్చాల్సి వచ్చింది. అప్పుడు డెమొక్రాట్ల తరఫున అల్​గోర్, రిపబ్లికన్ల తరఫున జార్జ్​బుష్​ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. దాదాపు హంగ్​ తరహా రిజల్ట్​ వచ్చింది. దాంతో డెమొక్రాట్లు రీకౌంటింగ్​ కోసం డిమాండ్​ చేశారు. అత్యంత కీలకమైన ఫ్లోరిడా, మరికొన్ని స్టేట్స్​లో రీకౌంటింగ్​ కూడా మొదలై.. వారాల పాటు సాగింది. అయితే రీకౌంటింగ్​లో అక్రమాలు జరుగుతున్నాయంటూ రిపబ్లికన్​ పార్టీ సపోర్టర్లు ఆందోళనలకు దిగారు. రీకౌంటింగ్​ ఆపేసి జార్జ్​బుష్​ను ప్రెసిడెంట్​గా ప్రకటించాలంటూ కోర్టులను ఆశ్రయించారు. ఆ టైంలో అమెరికా సుప్రీంకోర్టు అక్కడి రాజ్యాంగంలోని ‘సేఫ్​హార్బర్​ ప్రొవిజన్’ను వాడింది. దీని ప్రకారం.. ఓ నిర్ణీత టైంలోగా విన్నర్​ను ఖరారు చేయాల్సి ఉంటుంది. దీంతో రీకౌంటింగ్​ను ఆపేసిన సుప్రీంకోర్టు.. జార్జ్​బుష్​ను ప్రెసిడెంట్​గా ఎంపిక చేసింది.

కోర్టు ఓటుతోనే బుష్​ గెలిచారు

2000 ఎలక్షన్లలో కేవలం కోర్టు నిర్ణయం వల్లే జార్జ్​బుష్​ గెలిచారని, ప్రజల సపోర్ట్​ ప్రకారం అల్​గోర్​ ప్రెసిడెంట్​ అయి ఉండాల్సిందని ఫ్లొరిడా డెమొక్రటిక్​ రిప్రజెంటేటివ్​ జోసెఫ్​ గెల్లర్​ చెప్పారు. ఆ ఎలక్షన్​ నాటి పరిస్థితిని ఆయన గుర్తు చేసుకున్నారు. రీకౌంటింగ్​లో బుష్​ ఓడిపోయే పరిస్థితి ఉందంటూ రిపబ్లికన్​ సపోర్టర్లు భారీగా ఆందోళనలకు దిగారని.. దానివల్ల రీకౌంటింగ్​ నిలిపివేసే పరిస్థితి
వచ్చిందన్నారు.

For More News..

డిగ్రీ ఫైనల్​ కౌన్సెలింగ్ నవంబర్ మూడో వారంలో

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఫామ్ ధర రూ. 10 వేలు

ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్ ఇంటి దగ్గరి కాలేజీల్లోనే