
టొమాటోల రేట్లు చెట్టెక్కి కూర్చుని ఇప్పుడప్పుడే దిగేటట్టు కనిపించడం లేదు. అలాగని ఒక అరకేజీనో కేజీనో టొమాటోలు కొనుక్కొచ్చి పొదుపుగా పదిరోజులు వాడుకుందామంటే... అన్ని రోజులు ఫ్రెష్‌గా ఉండవు. చాలామందికి టొమాటో లేకుండా వంట ముందుకు కదలదు. మరెలా? ఇక మీదట మీకు ఆ సమస్య ఉండదు. ఎందుకంటే... ‘టొమాటోలను సరిగా స్టోర్ చేస్తే పదిరోజుల వరకు వాటి తాజాదనం పోదు. దానికి నేను గ్యారెంటీ’ అంటోంది రాచెల్ డోల్ఫి.
ఓపెన్ ఎయిర్ రిఫ్రిజిరేషన్
పది రోజుల తరువాత – టొమాటో రంగు, రుచి మారిపోయాయి.
రేటింగ్ 2/10
టొమాటోను పదిరోజులు రిఫ్రిజిరేటర్లో ఉంచితే టొమాటో పాడుకాలేదు. కానీ రుచిమారిపోయింది. ఎరుపు రంగు వెలసిపోయింది. లోపల భాగం లైట్‌గా బ్లీచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది. అలాగే ఈ పద్ధతి ఫాలో అయితే కనుక టొమాటోలను వాడాలనుకున్న గంట ముందు రిఫ్రిజిరేటర్ నుండి తీసి బయటపెట్టాలి.
క్లోజ్డ్ కంటెయినర్ రిఫ్రిజిరేషన్
పది రోజుల తరువాత – మెత్తపడ్డాయి. రంగు పాలిపోయింది
రేటింగ్ 2/10
టొమాటోలను మూత ఉన్న ఒక ట్రాన్సపరెంట్ బాక్స్‌లో పెట్టా. పది రోజుల తరువాత దీని రిజల్ట్ కూడా ఓపెన్ ఎయిర్ పద్ధతిలో టొమాటోలు ఉంచినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఈ పద్ధతి కూడా పనికిరాదని తేలిపోయింది.
కౌంటర్ టాప్
పది రోజుల తరువాత – చాలా మెత్తగా అయిపోయి, వాటి జీవితకాలం తగ్గిపోయింది.
రేటింగ్ 3/10
గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల మూడు నుంచి ఐదు రోజుల్లో మెత్తగా అయిపోయాయి. అయినా దీనికి రిఫ్రిజిరేట్ పద్ధతిలో నిల్వ చేసిన వాటికంటే రేటింగ్ ఎక్కువ ఎందుకు ఇచ్చానంటే ఆ టొమాటోల రుచి బాగుంది. టొమాటో లైఫ్‌స్పాన్ తక్కువగా ఉన్నా రుచి మాత్రం మారలేదు.
తొడిమె కిందకు పెట్టి...
పది రోజుల తరువాత – తేమ కాస్త తగ్గింది. కానీ రుచి మారలేదు.
రేటింగ్ 9/10
నా చిన్నప్పుడు మార్కెట్‌కి వెళ్లినప్పుడు రైతులు టొమాటోలను ఎలా నిల్వ చేస్తారో చూసి తెలుసుకున్న పద్ధతి ఇది. టొమాటోల తొడిమె భాగం పైకి పెట్టి నిల్వ చేస్తే దాని చుట్టూ గాలి బాగా సోకుతుంది. దాంతో బూజు పట్టడానికి, బ్యాక్టీరియా చేరడానికి మార్గం సుగమం అవుతుంది. అదే టొమాటోను తలకిందులుగా పెట్టి నిల్వ చేస్తే గాలి తగలడం కాస్త ఆగుతుంది. దాంతో బూజు పట్టడం ఆలస్యం అవుతుంది. ఈ పద్ధతిలో నిల్వ చేసిన టొమాటోను పదిరోజుల తరువాత చూస్తే దాని తొడిమె నుంచి చాలా తక్కువ మొత్తంలో తేమ బయటకు పోయింది. కానీ టొమాటో గట్టిదనం అలానే ఉంది. అలాగే దాని తీపిదనం పోయి పులుపు ఎక్కలేదు కూడా. అంటే రుచి మారలేదు. ఇలా నిల్వ చేయడం వల్ల టొమాటోను వండేందుకు ఫ్రిజ్‌లోంచి తీసి రూమ్ టెంపరేచర్‌కు వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పనిలేదు. టొమాటోలను బోర్లించి నిల్వ చేయొచ్చు అని తెలిసింది.
తొడిమె దగ్గర టేప్ వేసి..
పది రోజుల తరువాత – రుచిగా ఉంది. చూడటానికీ తాజాగానే ఉంది.
రేటింగ్ 10/10
ఈ మెథడ్ రాచెల్‌కు చాలా బాగా నచ్చింది. ప్రతిసారి టొమాటోలను బోర్లించి దాచే శ్రమ ఉండదు. ఇందులోకూడా టొమాటో తొడిమెలను బోర్లించి పెట్టినట్టే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఒక చిన్న మార్పు టేప్ వేయడం. ఇలాచేయడం వల్ల బ్యాక్టీరియా చేరేందుకు, బూజు పట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించే గాలి తగలకుండా ఆపాం. ఇందుకు వాడే టేప్ ఏదైనా పర్లేదు. తొడిమె మీద చిన్న టేప్ వేస్తే చాలు. ఇలాచేస్తే పది రోజుల క్రితం కొనుక్కున్న టొమాటోల స్కిన్ టైట్‌గా ఉంది. తేమ పోయిన దాఖలాలు లేవు. కాస్త నొక్కి చూసినా తాజాగా ఉన్నప్పుడు ఎలాగైతే సొట్టపడకుండా ఉంటుందో అలానే ఉంది. ఈ పద్ధతి ఫాలో అయితే టొమాటోలను రిఫ్రిజిరేటర్లో పెట్టి, వంట చేయాలనుకున్నప్పుడు వాటిని బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఇందుకు మీకు ఒక టేప్, రెండునిమిషాల టైం ఉంటే చాలు. టొమాటోలకు టేప్ వేయడమే ఆలస్యం. టొమాటోలు ఎక్కువ కాలం పాడుకాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని మించింది లేదు అంటోంది రాచెల్.
- ALSO READ:కిచెన్ తెలంగాణ : వెరైటీ అండ్ హెల్దీ
న్యూయార్క్‌కి చెందిన ఈమె ఫ్రీలాన్స్ ఫుడ్ స్టయిలిస్ట్. రెసిపి డెవలపర్. కలినరీ ప్రొడ్యూసర్. టొమాటోల రంగు, రుచి పోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు చాలా రీసెర్చి చేసింది రాచెల్. అందుకు మొత్తం ఐదు రకాల పద్ధతులు ఫాలో అయింది. ‘‘నా రీసెర్చి టొమాటోలు కొనడం దగ్గరి నుంచి మొదలైంది. అప్పుడప్పుడే పండటానికి రెడీగా ఉన్న టొమాటోలు కొన్నా. ఆ తరువాత తను ఎంచుకున్న ఐదు పద్ధతులతో వాటిమీద ఎక్స్పెరిమెంట్ చేశా. పదిరోజులు ఎక్స్పరిమెంట్ చేశాక ఒక్కో టొమాటో ఎలా ఉందో జాగ్రత్తగా గమనించా. పది రోజుల తరువాత టొమాటోల టెక్చర్, రుచి, అవి ఎంత పండాయా అనేది చూశా. మిగలపండాయా లేదా పూర్తిగా పాడయిపోయాయా? టొమాటో తొక్క మీద ముడతలు వచ్చాయా? వంటి అన్ని విషయాలు గమనించి ఆ తరువాత నేను ఫాలో అయిన ఒక్కో పద్ధతికి రేటింగ్ ఇచ్చా” అని తన ఎక్స్‌పరిమెంట్‌ను వివరించింది రాచెల్.