
హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ మహానగరం రూపు రేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడినట్టు చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్ పూర్తి చేసి పంపుతామని చెప్పినట్లు వెల్లడించారు. ఇవాళ (March 18) మండలిలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు.
బీఆర్ఎస్ మాదిరిగా తమకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదన్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ విషయంలో ఏడు సార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినట్టు చెప్పారు. రెండు నెలల్లో పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. మూడున్నర నుంచి నాలుగేళ్లలో ట్రిపుల్ ఆర్ పూర్తి చేస్తామని చెప్పారు.
ALSO READ | మూసీ పునరుజ్జీవం చేసి తీరుతం: మంత్రి శ్రీధర్‌బాబు