యుద్ధానికి సిద్దమే.. ట్రంప్ తీరుపై చైనా రియాక్షన్

యుద్ధానికి సిద్దమే.. ట్రంప్ తీరుపై  చైనా రియాక్షన్

ట్రంప్ తారీఫ్ ప్రకటనలపై సీరియస్గానే తీసుకుంది.. అమెరికా యుద్దానికి సిద్ధమవుతోందని ఆరోపిస్తోంది.. అదే గనక జరిగితే మేం కూడా యుద్దానికి సిద్దం అని ప్రకటించింది. ఇదే విషయంపై అమెరికాలోని చైనా ఎంబసీ సంచలన పోస్టును షేర్ చేసింది. యుద్ధానికి మేం సిద్దం అందులో రాసింది.  ట్రంప్ నుంచి టారిఫ్ పెంపు ప్రకటన వచ్చిన వెంటనే చైనా ఎంబసీ ఈ మేసేజ్ను పోస్ట్ చేసింది. మేం దేనిలో తక్కువ కాదు.. అమెరికా కోరుకుంటే మేం యుద్ధానికైనా సిద్దంగా ఉన్నామని కుండబద్దలు కొట్టింది. అమెరికా నిజంగా అక్రమ వలసల సమస్య, డ్రగ్స్ నియంత్రణ సమస్యను పరిష్కరించాలనుకుంటే నేరుగా చైనాతో సంప్రదించాలి.. అలా కాకుండా తారీఫ్ లను పెంచడం ఏంటీ.. యూఎస్  కోరుకుంటున్నది యుద్ధమే అయితే అది తారిఫ్ వార్ కావచ్చు..ట్రేడ్ వార్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు..మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని Xలో మేసేజ్ షేర్ చేసింది.  

మరోవైపు చైనా విదేశాంగ మంత్రి కూడా ట్రంప్ తీరుపై తీవ్రంగానే స్పందించారు. చైనా దిగుమతులపై తారీఫ్ లను పెంచేందుకు అమెరికా అక్రమ వలసల సమస్యను ట్రంప్ ఓ సాకుగా చూపిస్తున్నారని అన్నారు. దేశం హక్కులు, ప్రయోజనాలను రక్షించుకునేందుకు మేం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవే అని చెప్పారు.  

ఫెంటానిల్ సంక్షోభం పరిష్కారానికి మానవత్వం, అమెరికా ప్రజల పట్ల సద్భావనతో యూఎస్ కు సహాయం చేసేందుకు మేం చర్యలు చేపట్టాం.. దానిని గుర్తిం చకుండా చైనాపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తోంది. సుంకాలు పెంచుతూ చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు, బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తోందని అన్నా రు. యూఎస్ కు సహాయం చేసినందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు.. ఇలా అయితే యూఎస్ సమస్య పరిష్కారం కాదు.. ఇరు దేశాల మధ్య కౌంటర్ నార్కోటిక్ సహకారం దెబ్బతింటుందని అన్నారు. 

ALSO READ | ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బుడ్డోడు

ట్రంప్ అధికారం చేపట్టాక చైనాపై సుంకాల యుద్దం మొదలు పెట్టారు. చైనా వస్తువులపై ఇప్పటికే ఉన్న 10 శాతం కంటే అదనంగా మరో 10 శాతం సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. కెనడా ,మెక్సికోలతో పాటు చైనాలో కూడా కొత్త టారిఫ్‌లు ప్రారంభమయ్యాయి.

అయితే చైనా కూడా అమెరికాకు ధీటుగా దిగుమతి సుంకాలు పెంచేసింది.అమెరికానుంచి చైనాకు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెం చింది. సోయాబీన్స్, మొక్కజొన్న నుంచిపాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం వరకు వ్యవసాయ ఉత్పత్తులపై 10 శాతం,15 శాతం మధ్య అదనపు సుంకాలను విధిం చనున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

ట్రంప్ తారీఫ్ ప్రకటనలపై చైనా సీరియస్ గానే తీసుకుంది.. అమెరికా యుద్దానికి సిద్ధమవుతోందని ఆరోపిస్తోంది.. అదే గనక జరిగితే మేం కూడా యుద్దానికి సిద్దం అని ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం (మార్చి5) అమెరికాలోని చైనా ఎంబసీ సంచలన పోస్టును షేర్ చేసింది. మేం దేనిలో తక్కువ కాదు.. అమెరికా కోరుకుంటే మేం యుద్ధానికైనా సిద్దంగా ఉన్నామని కుండబద్దలు కొట్టింది.