వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు : రాజేందర్

వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు : రాజేందర్

రాజకీయ పార్టీలకు అతీతంగా జూన్ 3న ఉద్యమకారులకు సన్మానం నిర్వహిస్తానని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ కారుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన తాత్కాలిక కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెనక ఉండి పోరాటాలు చేశామని అన్నారు.

వరంగల్ జోన్ ను భద్రాద్రి జోన్ గా తరలిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా ను 6జిల్లాలుగా విభజిస్తే ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. వరంగల్ లోని వనరులు తరలి పోతుంటే ఏమీ చేశారని ఫైర్ అయ్యారు.  కతీయతోరణంపై సీఎం ద్రుష్టికి తీసుకపోతామని తెలిపారు. పుట్టిన గడ్డ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వండని సూచించారు. ఖమ్మం, కరీంనగర్ మాదిరిగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని సీఎం దృష్టికి  తీసుకెళ్లానని చెప్పారు రాజేందర్ రెడ్డి.