సైకాలజీ : ఆఫీసుల్లో పదే పదే ఇలా చెప్తే.. చులకనై పోతాం

సైకాలజీ : ఆఫీసుల్లో పదే పదే ఇలా చెప్తే.. చులకనై పోతాం

మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే.. దానికి కావాల్సిన సంకేతాలు వెంటనే మైండు వెళ్లిపోతాయి. అందుకు సంబంధించిన టాలెంట్ ఉందా లేదా..? అని నిర్ధారించేస్తుంది మైండ్. వాళ్లకి లక్ష్యాన్ని సాధించలేను అనే అనుమానం ఉంటే.. వెంటనే అలక్ష్యంపై ఆసక్తి లేకుండా చేస్తుంది. బద్ధకం వచ్చేస్తుంది. అందుకు సంబంధించిన పని చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక అబద్ధం అడేలా చేస్తుంది. 

సాకులు చెప్పే వాళ్లలో తొంభైశాతం మంది ఇలాంటి వాళ్లే. అదే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది చేసే ప్రతిభ ఉందనే సానుకూల దృక్పథంతో ఉంటే మైండ్ నుంచి అనుకూల వైబ్రేషన్స్ వస్తాయి. పని చేయడానికి అనుకూలంగా మనసు, శరీరం సిద్ధమైపోతాయి. ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు వెంటనే "నాకు కుదరదు. నేను చాలా బిజీ' అని చెప్పేవాళ్లు... నిజంగా బిజీగా ఉన్నారా.. 

గౌరవం కోసం చెప్పుకుంటున్నారా.. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారా.. సలహా పాటించడం ఇష్టం లేక అన్నారా... అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా... పదేపదే 'నేను బిజీ. నేను బిజీ' అని చెప్తే చులకనై పోతారు. అలా చెప్పడం నేరం కాకపోయినా తోటివాళ్లు జోకులేసేలా చేస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలి.