ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది. పండుగల వేళ కస్టమర్లకు మరింత ఖర్చును పెంచుతోంది. ఈ ఆన్ లైన్ యాన్ ఫ్లాట్ ఫాం ఫీజును భారీగా పెంచింది.
ఏప్రిల్ లో ఫ్లాట్ ఫీజులు పెంచిన జొమాటో దీపావళి పండగ సీజన్ లో మరోసారి ఫుడ్ డెలివరీలపై ప్రత్యేకంగా వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆర్డర్ పై రూ.7 ను వసూలు చేస్తుండగా.. ఒకేసారి రూ.3 లు పెంచడంతో రూ. 10 లకు చేరింది.
పండగ సీజన్ లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్లాట్ ఫాం ఫీజు పెంచుతున్నట్లు జొమాటో యాజమాన్యం తెలిపింది. జొమాటో విజయవంతంగా నడవాలంటే.. ఈ ఫీజు చెల్లించాలని యాప్ లో కస్టమర్లకు నోటిఫికేషను పంపుతోంది.
ALSO READ | KBR Park: కేబీఆర్ పార్క్ వద్ద కొత్త రూల్.. పార్కింగ్ నిబంధనలు పాటించకపోతే ఫైన్
ఇప్పుడు దీపావళి పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మరోసారి జొమాటో షాకింగ్ ప్రకటన చేసింది. ఫుడ్ డెలివరీలపై కొంతకాలంగా ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం ఇది ఆర్డర్‌పై రూ. 7 గా ఉండగా.. ఒకేసారి రూ. 3 పెంచి 10 రూపాయలకు చేర్చింది. జొమాటో విజయవంతంగా నడవాలంటే.. ఈ ఫీజు చెల్లించి కృషి చేయాలని యాప్‌లో కస్టమర్లకు నోటిఫికేషన్ పంపుతోంది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్లాట్‌ఫామ్ ఫీజు స్వల్పంగా పెంచినట్లు చెప్పుకొచ్చింది.