
బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ మంచి అవకాశం. సరైన ప్లానింగ్‌తో సిద్ధమైతే కొలువు కొట్టడం సులువే. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6432 పీవో/ మేనేజ్‌మెంట్ ట్రెయినీల ఖాళీలు భర్తీ చేయనున్నారు. తుది నియామకాలు జరిపే సమయానికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తొమ్మిది నుంచి 12 నెలలు సీరియస్‌గా ప్రిపేర్ అయితే బ్యాంక్ ఉద్యోగం సులువుగా సాధించవచ్చు.
ఐబీపీఎస్ ద్వారా పీవోతోపాటు మేనేజ్‌మెంట్ ట్రైనీలకు నోటిఫికేషన్ జారీ అయింది. 11 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటుంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూబీఐ ఉన్నాయి.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ మూడు పద్ధతుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడంచెల్లో ఉంటుంది. అక్టోబర్లో ప్రిలిమ్స్, నవంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అర్హతలు: వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, అంగవైకల్యం ఉన్నవారికి పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ఉత్తీర్ణులై ఉండాలి. ఆగస్టు22వ తేదీ నాటికి డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో 10 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నల్లగొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, వరంగల్ లో సెంటర్స్ ఉన్నాయి.
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సబ్జెక్టులు ఉంటాయి. అవి జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. ప్రిలిమ్స్‌లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు, 30 మార్కులు. కనీసం క్వాలిఫై మార్కులు సాధించాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి. రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్‌లో ప్రతి సబ్జెక్టుకు సపరేట్ కటాఫ్ మార్కులు ఉంటాయి. ప్రతి దాంట్లో క్వాలిఫై కాకపోతే మెయిన్స్‌కు అర్హత ఉండదు.
మెయిన్స్ ప్లాన్: మెయిన్స్ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. వీటితోపాటు ఇంగ్లిష్ లో లెటర్ రైటింగ్, ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. అవి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్. మెయిన్స్ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సేకు 30 నిమిషాలు ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. జనరల్ ఎకానిమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు, లెటర్ రైటింగ్, ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి.
ఇంటర్వ్యూ ప్రాసెస్: ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థుతలు ఇంటర్వ్యూలో కనీస అర్హతగా 40 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఇంటర్వ్యూలో 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులపై అభ్యర్థి ఫైనల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. మెయిన్స్‌కు 80శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు: పీవో, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీలు 6432 ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీ 2596, ఈడబ్ల్యూఎస్‌లో 616, ఓబీసీ కేటగిరీలో 1741, ఎస్సీ కేటగిరీలో 996, ఎస్టీ విభాగంలో 483 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యాంకుల వారీగా పరిశీలిస్తే కెనరా బ్యాంక్‌లో అత్యధికంగా 2500 ఖాళీలు ఉండగా ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఇండియాలో 2094, యూకో బ్యాంక్‌లో 550, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 535, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 500, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 253 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్: ఈ సబ్జెక్టు మీద ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రిపీటెడ్ ప్రశ్నలు కాగా రెండు ఒక సంవత్సరం ముందు వరకు కొత్తగా కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులో వచ్చిన కొత్త అంశాలపై అడిగే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలలో భారీ మార్పులు వచ్చాయి. 90శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్కు సంబంధించినవే అడుగుతున్నారు.
జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్: ఈ సబ్జెక్టు కొంచెం విస్తృతంగా కనిపించినా ప్రీవియస్ పేపర్స్ పరిశీలిస్తే ముఖ్యమైన అంశాలు ఏమిటో తెలుస్తుంది. డివైడ్ చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎకానమీలో బ్యాంకింగ్ లింక్ కలిగిన ఎకానమీ మీదే ఫోకస్ చేయాలి. ఆర్బీఐ పాలసీలు, బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులపై అవగాహన పెంచుకోవాలి.
ఐబీపీఎస్ పీవో ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం(ని.)
ఇంగ్లిష్ 30 30 20
ఆప్టిట్యూడ్ 35 35 20
రీజనింగ్ 35 35 20
మొత్తం 100 100 60
మెయిన్స్
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు టైమ్
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 60 60
డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 60 45
జనరల్/ఎకానమి/బ్యాంకింగ్/అవేర్నెస్ 40 40 35
ఇంగ్లిష్ 35 40 40
మొత్తం 155 200 180
నోటిఫికేషన్:
మొత్తం ఖాళీలు: 6432
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
పరీక్షలు: ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్లో, మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్‌లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు జనవరి లేదా ఫిబ్రవరిలో జరగనున్నాయి.
వెబ్సైట్: www.ibps.in
పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీస్ IAS స్టడీ సర్కిల్