
పాస్ బుక్కులిచ్చేందుకు లంచం అడిగితే వేటు తప్పదని వీఆర్వోలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు మంగళవారం రెవెన్యూ సిబ్బందికి హెచ్చరికలు చేశారు. కొందరు లంచాలు తీసుకుంటూ డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తెస్తున్నారని, టెక్నికల్ ఎర్రర్స్ సరిచేసేందుకు కూడా లంచం అడుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ‘పాస్‌బుక్కులు పొందడం రైతుల హక్కు, పాస్‌బుక్కులు ఇవ్వడం వీఆర్వోల బాధ్యత’ అని అందులో హితబోధ చేశారు. రైతులతో అనుకువగా ఉండాలని, వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కోరారు.