
అభివృద్ది చెందుతున్న దేశాలకు వరల్డ్ బ్యాంక్ కీలక సూచనలు చేసింది. అమెరికాతో వీలైనంత త్వరాగా వాణిజ్య ఒప్పందాలను చేసుకోవాలని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కోరారు. జాప్యం చేస్తే తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రపంచ బ్యాంకు విధానాల పరిశీలన చేస్తున్నామన్నా ఆయన.. IBRD నుంచి చైనా తీసుకుంటున్న రుణాలు తగ్గించాలని కోరారు. అదే సమయంలో సబ్ సహారా ఆఫ్రికా లాంటి దేశాల్లో పవర్ వినియోగం పెంచాలని కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్థానికంగా ఉద్యోగాల సృష్టిని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వాషింగ్టన్ లో జరిగిన ప్రపంచ బ్యాంకు , IMF సమావేశాల సందర్భంగా బంగా ఈ ప్రకటన చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు తీరు, అమెరికా వాణిజ్యంపై పెరుగుతున్న ఆందోళనల క్రమంలో బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరిలో తిరిగి అధికారం చేపట్టిన ట్రంప్.. అప్పటినుంచి ప్రపంచ దేశాలపై 10 శాతం బేస్ లైన్ సుంకాన్ని విధించారు ఆ తర్వాత అల్యూమినియం, ఉక్కు, అమెరికాలో తయారు కానీ కార్లవంటి దిగుమతులపై 25 శాతం సుంకం విధించారు.
ట్రంప్ సుంకాలను వివిధ దేశాలు తిరస్కరించడంతో ప్రస్తుతం అధిక సుంకాలు నిలిపివేశారు. ఈ క్రమంలో అభివృద్ది చెందుతున్న దేశాలు త్వరగా అమెరికాతో ఒప్పందాలు చేసుకొని వ్యాపారపరంగా ఉన్న అడ్డంకులను తొలగించుకొని ప్రాంతీయ వాణిజ్యంపై దృష్టి సారించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.