Good Health : అర గంట ఒళ్లొంచి.. ఇంటి పని చేస్తే.. గుండె జబ్బు వచ్చే ఛాన్స్ తక్కువ..

Good Health : అర గంట ఒళ్లొంచి.. ఇంటి పని చేస్తే.. గుండె జబ్బు వచ్చే ఛాన్స్ తక్కువ..

ఆరోగ్య మహాభాగ్యం.. ఇదొకటి ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు. చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్ కు వెళ్తే... మరికొందరు యోగా, రన్నింగ్ లాంటి వ్యాయామాలు చేస్తుంటారు.. అయితే  ఇక నుంచి ఇంట్లో ఉండి ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అదెలా అంటారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి...

 రోజు అరగంటపాటు ఇంటి పనులు చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నాయి పలు స్టడీస్.   అంతేగాదు గుండె జబ్బులను కూడా కొంత తగ్గించుకోవచ్చు. వారానికి నూట యాభై నిమిషాల ఇంటి పనులతో పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు.

బట్టలు ఉతకడం, ఇల్లు కడగడం. గార్డెనింగ్ చేయడం వంటి చిన్న చిన్న పసుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు కూడా చెప్తున్నారు. రోజుకు కనీసం 30  నిమిషాలపాటు ఇంటి పనులు చేయడం వల్ల డెత్ రిస్క్ నూ 28 శాతం తగ్గించవచ్చట. గుండె జబ్బులను 20 శాతం నివారించవచ్చని తేలిందని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

దేశంలో సగానికి సగం మంచికి సరైన శారీరక శ్రమ లేదని చాలామంది చెప్పేమాట. నడవడం, మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం వల్ల శరీరానికి సరిపడా వ్యాయామం అందుతుంది. ఇంట్లో ఏదైనా పని చేయాల్సి వస్తే నో అనకుండా ఓకే చెప్పేయండి  మరి..