బరువు తగ్గేందుకో, ఫిట్నెస్ కోసమే చాలామంది జిమ్లకు వెళ్తుంటారు. బాడీ ఫిట్నెస్ కోసం ట్రైనర్లను పెట్టుకుంటారు. ఫిటెనెస్ ట్రైనర్లు, పైసా ఖర్చు లేకుండానే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే రన్నింగ్. జిమ్, యోగా లాంటి ఒక టైం కేటాయించాలి. కానీ రన్నింగ్కు అలాంటి సమయమే అవసరం ఉండదు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. జాగింగ్, రన్నింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ప్రతిఒక్కరూ రన్నింగ్ను డెయిలీ లైఫ్ లో భాగం చేసుకోవాలి. ఫిట్నెస్తో పాటు పరుగు మానసిక ఆరోగ్యానికీ తోడ్పడుతుంది.
పరిగెత్తేవాళ్లలో ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. దాంతో రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు. పరిగెత్తడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రన్నింగ్, జాగింగ్ చేసేవాళ్లలో కాన్ఫిడెన్స్, కాన్సన్ ట్రేషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. రన్నింగ్ శారీరకంగానే కాదు, మానసికంగానూ బలంగా ఉంచుతుంది. లైవ్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ రన్నింగ్ చేయాలి.
ఈవినింగ్, మార్నింగ్ ఏ టైమ్లో రన్నింగ్ చేసినా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈవినింగ్ కన్నా మార్నింగ్ రన్నింగ్ చేస్తే రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. ఎర్లీ మార్నింగ్ సూర్య కిరణాల వల్ల విటమిన్ డి లోపం రాకుండా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్తో శ్వాస సమస్యలు కూడా ఉండవు. రక్తసరఫరా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యమూ బాగుంటుంది. రన్నింగ్ వల్ల శరీరం మొత్తానికీ ఎక్సర్ సైజ్ అవుతుంది. క్యాలరీలు బాగా కరుగుతాయి. కొలెస్ట్రాల్ సమస్యఉండదు. రన్నింగ్ పొట్ట అసలే ఉండదు.
మధుమేహ సమస్యలూ తక్కువే. బిపి కూడా అదుపులో ఉంటుంది. పరుగు ఎముకలకీ కండరాలకీ కూడా మంచిదే. అవి బలంగా ఉండేలా చేస్తుంది. చిన్నప్పటి నుంచీ పరుగెత్తే అలవాటు ఉన్న వాళ్లకి భవిష్యత్తులో కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే గతంలో ఈ అలవాటు లేకున్నా ఏ వయసులోనైనా పరుగును ప్రారంభించవచ్చు. ముందు బ్రిస్క్ వాక్తో మొదలెట్టి క్రమంగా జాగింగ్లోకి మారాలి.