ఎండలో బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే మొదటగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి లభించే అమృతం ఇది. ఈ నీళ్లు శరీరాన్ని త్వరగా చల్ల బరుస్తాయి. వడదెబ్బ నుంచి కాపాడతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే ప్రొటీన్లు, ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎండాకాలంలో చాలామంది భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి కొబ్బరి బోండాలు తాగుతుంటారు. అందుకే ఎండాకాలం రాగానే కొబ్బరి బోండాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ప్రకృతిలో లభించే కల్తీ చేయలేని డ్రింక్ కావడంతో ఎక్కువమంది కొబ్బరినీళ్లకో ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి బోండాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణాల్లో అయితే ఒక్కో దుకాణంలో రోజుకు ఐదు వందల కొబ్బరి బోండాలు అమ్ముడుపోతున్నాయి. చిరు వ్యాపారులు కూడా రోజుకు రెండు వేల రూపాయలు సంపాదిస్తున్నాయి.
దీనికి ఇంతగా డిమాండ్ ఉండడానికి కారణం ఇందులో అనేక పోషక విలువలు ఉండడమే. అంతేకాకుండా దీన్ని అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగితే కావాల్సిన శక్తి వెంటనే వస్తుంది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు తాగితే శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. అందుకే డాక్టర్లు కూడా కూల్ డ్రింకు బదులుగా కొబ్బరి బోండాలు తాగాలని సూచిస్తుంటారు.
పోషకాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, కాపర్, సల్ఫర్, క్లోరైడ్ పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్లు కూడా అధికంగానే ఉంటాయి. లేత కొబ్బరి నీళ్లలో ఆస్కార్బిక్ యాసిడ్, బి విటమిన్లు, విటమిన్ సి కూడా ఉంటాయి.
ఉపయోగాలు
• కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్ పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎండవల్ల
శరీరం కోల్పొయిన ఎలక్ట్రోలైటిని అందిస్తుంది. పొటాషియం రక్తపోటు, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
• పొటాషియం, మెగ్నీషియం మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా చేస్తాయి. తామర వంటి చర్మవ్యాధులు. కూడా నయం అవుతాయి.
* ఆవు ఫాస్ఫటేజ్, డాటలేజ్, డిహైడ్రోజినేజ్ డయాస్టేజ్, పెరాక్సిడేజ్, ఆర్ఎన్ఎ పాలిమెరేజ్ లాంటి చాలా ఎంజైమ్లు ఉంటాయి. ఇవి అరుగుదలకు, జీవక్రియకు తోడ్పడతాయి.
• ఈ నీళ్లలో క్యాన్సర్ను తగ్గించే కారణాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకైనిన్లు ఉంటాయి.