మిడిల్ ఈస్ట్లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించింది బాదం పప్పు, అన్ని డ్రైఫ్రూట్స్ లాగే ఇందులోనూ పోషకాలు ఎక్కువ. వీటిని ప్రతి రోజు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే 'ఫైటో కెమికల్స్'' కేన్సర్ని, పీచుపదార్థం మలబద్ధకాన్ని దూరం చేయడంతో పాటు 'విటమిన్ ఇ' యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పిండి పదార్థం తక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులకు చాలా మంచిది. అందుకే ప్రతిరోజు నాలుగు బాదంపప్పులు తినాలని డాక్టర్లు చెబుతారు. మరి బాదంపప్పు వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం..
గుండె పదిలం
పది బాదంపప్పులను వారంలో ఐదుసార్లు తీసుకుంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్ -ఇ ఉంటుంది. ఇది చక్కని యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. నానబెట్టిన బాదంపప్పుల్లో ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
కొలెస్ట్రాల్ నియంత్రణ
బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్ షేక్, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. వీటిలో మోనో, పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు. బాదంపప్పులను ఉదయాన్నే తీసుకుంటే మంచిది.
రక్త ప్రసరణ
బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. నానబెట్టిన బాదంపప్పుల్లో ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం ఉండే రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తాయి.
ఎముకల దృఢత్వం
ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్ ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఐరన్ శరీర అవయవాలకు, కణాలకు ఆక్సిజన్ ను చేరవేస్తుంది. ఇందులో విటమిన్ -బి ఐరన్, రైబోఫ్లెవిన్) ఎక్కువగా ఉండటం వల్ల కండరాల పెరుగుదలకు, సహాయపడటమే కాకుండా కండరాల నొప్పులను కూడా తగ్గిస్తాయి. పాల ఉత్పత్తులు పడని వాళ్లు బాదం పాలను తీసుకోవచ్చు. దంతాల ఆరోగ్యం కోసం బాదం తినాల్సిందే.
బరువు తగ్గొచ్చు
బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా ఎలాంటి సమస్యా ఉండదు. నానబెట్టిన బాదం గింజలపై తొక్క తీసి తింటే అందులో ఉండే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుల వల్ల ఆకలి తగ్గి, కడుపు నిండుగా ఉంటుంది.
తక్షణశక్తి
అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తింటే తక్షణ శక్తి వస్తుంది. అందులో రైబోఫ్లెవిన్, కాపర్, మెగ్నీషియం.. లాంటి ఈ మధ్య కాలిఫోర్నియాలో చేసిన ఒక స్టడీలో.. మామూలు భోజనంతో పాటు బాదంపప్పులతో కూడిన భోజనాన్ని కొంతమందికి తినిపించారు.
అయితే, మామూలు భోజనం తిన్న వాళ్ల కంటే బాదంపప్పులతో భోజనం చేసిన వాళ్లు శక్తివంతంగా తయారయ్యారని ఆ స్టడీలో వెల్లడైంది. బాదం పప్పులు గుండె, కడుపులో మంటలను తగ్గిస్తుందని టొరెంటో విశ్వవిద్యాలయం వైద్య నిపుణుడు సిరిల్ కెనాల్ చెప్పాడు. పోషకాలు శరీరానికి శక్తి అందిస్తాయి. వంద గ్రాముల బాదం పప్పులో 1.15 మిల్లీగ్రాముల ఆక్ట్రానిక్ రూపంలో లభిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను పోగొడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మధుమేహంతో బాధపడేవారు భోజనం తర్వాత బాదం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వంద గ్రాముల్లో..
శక్తి 571 కిలో కేలరీలు, ప్రొటీన్స్ 21.43 గ్రాములు, ఫైబర్ 10.7 ము, షుగర్ 3.57 గ్రాములు, ఫ్యాట్ 50గ్రాములు, కాల్షియం 2006 మిల్లీ గ్రాములు, ఐరన్ 3.86 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 536 మిల్లీ గ్రాములు, పొటాషియం 714 మిల్లీ గ్రాములు, కాపర్ 1.07 మిల్లీ గ్రాములు, మాంగనీస్ 2. మిల్లీ గ్రాములు ఉంటాయి. భోజనం తర్వాత తింటే రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించి, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
బాదంపప్పులను నీటిలో నానబెట్టి, పైన తొక్కు తీసి తినడం వల్ల సులువుగా జీర్ణమై ఎక్కువ పోషకాలు అందుతాయి. నీళ్లలో రెండు, మూడు బాదం పప్పులు నానబెట్టి రోజూ చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్దకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని... బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. రోజూ నాలుగు నుంచి పప్పులు తినడం వల్ల కేంద్రనాడీ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది.
క్యాన్సర్ రాకుండా...
బాదం తినడం వల్ల పెద్దపేగుకు క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అమెరికన్ అసోసియేషన్ 'ఆహార నియంత్రణ జర్నల్'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం.. ప్లాస్మా, ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుందని తెలిసింది.
మలబద్దకం
బాదంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నింది. నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల శరీరంలో జీర్ణక్రియ బాగుంటుంది. నానబెట్టిన బాదంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గిపోయేలా చేస్తాయి. నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
పుట్టే బిడ్డలకు ...
బాదంలో ఎక్కువగా ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. కాబట్టి గర్భిణులకు ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. శిశువులో కణాలు పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఫోలిక్ యాసిడ్ వల్ల పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తాయి.
జుట్టుకి ఉపయోగం
కాస్మోటిక్స్ తయారీ ఉపయోగించే విటమిన్ -డి, మెగ్నీషియంబాదంలో ఎక్కువగా ఉంటాయి. శరీరంలో మెగ్నీషియం తక్కువైతే వెంట్రుకలు. రాలిపోతాయి. కాబట్టి వారానికి ఒకసారి బాదం ఆయిల్ రాసుకోవడం వల్ల తల తేదుగా ఉండి.. జుట్టు రాలడం తగ్గుతుంది. రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల చర్మం గట్టిగా, ముడతలు లేకుండా మారుతుంది.