ఈ బిజీ బిజీ లైఫ్లో వేళకాని వేళల్లో ఆహారం తీసుకోవడం, వ్యాయామానికి దూరంగాఉండటం మొదలైన కారణాలతో చాలామంది బరువు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక బరువు కారణంగా ఊబకాయ సమస్యలు తలెత్తి జీవితాంతం అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటున్నారు. అలాంటి వాళ్లు పండుమిర్చితింటే బరువు తగ్గడంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందంటున్నారు.
పరిశోధకులు. పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చని అమెరికాలోని వెర్మోంట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పదహారు వేల మందిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు తరచూ పండు మిరపకాయలు తినడం వల్ల బరువు తగ్గుతారని నిర్ధారించారు.అంతేకాదు ఇవి తినడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్ లా పని చేసి శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీని ద్వారా మనిషి ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.