క్రీడా ప్రాంగణాలు గిట్లుంటే.. ఆడుకునుడెట్లా?

కామారెడ్డి, వెలుగు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  పిల్లలు, యువకులు ఆటలాడుకునేందుకు  ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోంది.  కొన్ని మండలాలు, గ్రామాల్లో అధికారులు గ్రౌండ్స్​ఆటలకు అనుకూలంగా లేకున్నా.. నామ్​కే వాస్తే  బోర్డులు ఏర్పాటు చేసి వదిలేస్తున్నారు.  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్​లో తెలంగాణ క్రీడా ప్రాంగణమని పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు.  ఆ స్థలం  పూర్తిగా రాళ్లతో నిండి ఉంది.  కనీసం ఇక్కడ  చదును చేసి , మొరం కూడా పోయలేదు.  మరి ఇక్కడ పిల్లలు ఆటలెట్లా ఆడుకోవాలో ఆఫీసర్లే చెప్పాలని గ్రామస్తులు 
ప్రశ్నిస్తున్నారు.