వెరైటీ : ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!

వెరైటీ : ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!

ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు. కోరికలు తీర్చమని దేవుడ్ని ప్రార్ధించడానికి వెళ్తారు. మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమనో, త్వరగా పెళ్లి అవ్వాలనో కోరుకుంటారు. కానీ జపాన్లోని ఓ గుడికి మాత్రం విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికి వెళ్తారట. ఎందుకంటే బంధాల నుంచి విముక్తి చేయడానికి ఆ ఆలయం ప్రసిద్ధి. 'యాసుయ్ కోనేగు' అనే ఈ దేవాలయం జపాన్లోని ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన జిల్లా హిగషియమలోని క్యోటో నగరంలో ఉంది.

భాగస్వామితో విడిపోవాలనుకున్నా, మరోకరితో నసాగుతున్న తన జీవిత భాగస్వామి అఫైర్ కు ఫుల్ స్టాప్ పడాలన్నా.. ఉన్న ఉద్యోగంలో నుంచి తనంతట తాను కాకుండా కంపెనీయే సామరస్యంగా బయటకు పంపాలన్నా, వ్యాపార భాగస్వామితో వ్యాపారం ముగించాలన్నా ఈ గుడికి వచ్చి మొక్కుకుంటే చాలట. వాగ్వాదాలు, ఘర్షణలు, కోర్టు కేసులు ఇలాంటి సమస్యల్లో గొడవలు జరగకుండా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఆ బంధాలు తెగిపోవాలంటే 'యాసుయ్ కొన్నేగు' దేవాలయంలో ప్రార్ధనలు చేస్తే చాలు అని అక్కడి వారి విశ్వాసం. ఇక్కడ, దేవాలయంలో పెద్ద బండరాయి ఉంటుంది.. దాని మధ్యలో మనిషి దూరేంత రంధ్రం ఉంటుంది.

ALSO READ :- ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

భక్తులు తాము తెంచుకోవాలనుకుంటున్న బంధం వివరాలను చీటిపై రాసి బండరాయి మధ్యలో ఉన్న రంధ్రం నుంచి రెండు సార్లు బండరాయిపై ఉన్న వస్త్రానికి కట్టాలి. తమ బంధాన్ని దూరం చేయమని ప్రార్థించాలి. అలా చేసిన వారికి ఖచ్చితంగా మొక్కు తీరుతుందని జపాన్ ప్రజల నమ్మకం.