
ముక్కులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది ఆ బాలుడికి.. భయంతో పేరెంట్స్ తెలిపాడు. పరుగుపరుగున బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడికి పరీక్షిం చిన డాక్టర్లు.. దానిని బయటికి తీశారు. ఆ వింత పురుగును చూసి షాకయ్యారు. అది ఏం పురుగులు, దాని స్వభావమేంటో తెలుసుకునేందుకు ఏకంగా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన కాశ్మీర్ లోని అనంతనాగ్ లో జరిగింది. స్థానిక ఎంఎంఏబీఎం హాస్పత్రికి మంగళవారం ఓ బాలుడి ముక్కు రంధ్రంలోని పాములాంటి ఓ పెద్ద పురుగును డాక్టర్లు తొలగించారు.
బాలుడి ముక్కు రంధ్రంలో తోకలాంటి వస్తువు ఆకస్మాత్తుగా బయటికి రావడంతో ఎంఎంఏబీఎం హాస్పత్రికి తరలించారు పేరెంట్స్. బాలుడిని పరీక్షించిన ENT డాక్టర్లు బాలుడి ముక్కు లోపల పెద్ద పాము లాంటి పురుగు ఉందని అనుమానించారు. ఆస్పత్రి హెడ్ తో చర్చించి డాక్టర్లు చేయాల్సి చేసి.. ముక్కు నుంచి పెద్ద పాము లాంటి పురుగును బయటికి తీశారు. ఏం పురుగు, దాని స్వభావం ఏందీ నిర్ధారించేందుకు స్పేస్‌మెన్‌లను ఫోరెన్సిక్స్ ప్రయోగశాలకు పంపారు.
అనంత్ నాగ్ లోని ఈ ఆస్పత్రిలోని ENT విభాగం ఇలాంటి అరుదైన కేసులను వైద్య పరిష్కారం చూపిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 225 కి పైగా థైరాయిడ్ శస్త్రచికిత్సలు, 50 కి పైగా లాలాజల గ్రంథి/పరోటిడ్ శస్త్రచికిత్సలు, అనేక మాక్సిలెక్టోమీలు నిర్వహించారట. స్వరపేటిక , హైపోఫారింక్స్ క్యాన్సర్ల 80 కి పైగా కేసులను నిర్ధారించి చికిత్స చేశారట.