క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేస్తున్నారా..? ఈ ట్రాప్లో పడొద్దు జాగ్రత్త..!

క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేస్తున్నారా..? ఈ ట్రాప్లో పడొద్దు జాగ్రత్త..!

డైలీ స్పెండింగ్స్ కోసం క్రెడిట్ కార్డులను వినియోగించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఇప్పుడు వాడుకుని తర్వాత మొత్తం ఒకేసారి పే చేద్దాం లే అనే ధోరణి పెరిగిపోయింది. క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసుకునే ఫెసిలిటీ వచ్చినప్పటి నుంచి ఈ ట్రెండ్ ఎక్కువైంది. అయితే క్రెడిట్ కార్డును యూపీఐ కి లింక్ చేయడం సౌకర్యంగా ఉంటుంది.. కానీ అనుకోకుండా ట్రాప్ లో పడితే ఇక అంతే.. అదేంటో తెలుసుకోండి. 

క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేసుకునే సదుపాయం 2022 నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఆర్బీఐ నుంచి రూపే క్రెడిట్ కార్డుకు మాత్రమే పూర్తి స్థాయి అనుమతి లభించింది. అంతకు ముందు వరకు కేవలం బ్యాంకు అకౌంట్లు, డెబిట్ కార్డ్స్ మాత్రమే లింక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఆర్బీఐ అనుమతి తర్వాత ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ సర్వీస్ యాప్స్ వినియోగించి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయడం చాలా ఈజీ అయ్యింది. దీంతో ఇటీవల రూపే క్రెడిట్ కార్డులకు డిమాండ్ ఫుల్లుగా పెరిగి పోయింది. ప్రతి బ్యాంకు రూపే క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. 

అయితే డైలీ స్పెండిగ్స్ కోసం ఎలా పడితే అలా పడితే క్రెడిట్ కార్డ్స్ వాడితే ఎప్పటికప్పుడు బిల్ పేమెంట్స్ చెక్ చేసుకోవడం, టైమ్ కు బిల్స్ కట్టేలా చూసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే టైమ్ కు బిల్ చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పడిపోతుంది. దీంతో లాంగ్ రన్ లో లోన్ బుక్ పై చాలా ప్రభావం పడుతుందని అంటున్నారు ఎనలిస్టులు.

లాభాలు నష్టాలు.. ట్రాప్:

యూపీఐ ద్వారా స్పెండింగ్ ఫెసిలిటీతో వినియోగం పెరిగి ఒక్కోసారి లిమిట్ దాటి స్పెండ్ చేయడం జరుగుతుంటుంది. దీనివలన హెవీ ఇంట్రెస్టులు పడే అవకాశం ఉంటుంది. 

క్రెడిట్ కార్డ్ పై అట్రాక్టి్వ్ ఆఫర్స్ ఇస్తుంటారు. బిల్ కట్టే సామర్థ్యం ఉందా లేదా అనేది చూసుకోకుండా ఆఫర్లకు ఆశపడితే.. చివరికి అప్పుల్లో కూరుకుపోవడం పక్కా. 

రెగ్యులర్ గా బ్యాంకుల్లో ఉండే వడ్డీల కంటే క్రెడిట్ కార్డ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటీవలే సుప్రీం కోర్టు కూడా 30 నుంచి 40 శాతం వరకు ఇంట్రెస్ట్ వేయొచ్చునని చెప్పడంతో భారీ వడ్డీలతో నడ్డి విరిచేస్తాయి కంపెనీలు. కాబట్టి ఎంత అయితే తిరిగి కట్టగలమో అంతకంటే తక్కువ స్పెండ్ చేయడం మంచిది. అందుకే ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

క్రెడిట్ కార్డు కంపెనీ ఇచ్చిన లిమిట్ దాటి ఖర్చు చేస్తే సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ ఫుల్.