వ్యాక్సిన్ కావాల్నా.. సిరంజీ తెచ్చుకో

వ్యాక్సిన్ కావాల్నా.. సిరంజీ తెచ్చుకో
  • సప్లయ్​ లేదంటూ చేతులెత్తేసిన అధికారులు
  • జనం ప్రశ్నించడంతో రేపు రావాలని చెప్పి నిలిపివేత
  • ఎల్బీనగర్ సర్కిల్​లోని చంపాపేట్ కమ్యూనిటీ హాల్​లో ఘటన
  • ఏర్పాట్లు చేయడమే మా పని.. సిరంజీలు ఇవ్వడం కాదన్న జీహెచ్ఎంసీ ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: నిన్నమొన్నటి దాకా టీకాల కొరతతో వ్యాక్సినేషన్ నిలిచిపోయేది. ఇప్పుడు వ్యాక్సిన్ ఉన్నా సిరంజీల కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ వేయించుకునే వారే బయటి నుంచి సిరంజీలు తెచ్చుకుందామన్నా దొరకని పరిస్థితి. దీంతో వ్యాక్సినేషన్ మధ్యలోనే ఆగిపోయింది. దీనిపై హెల్త్, జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఒకరిపై ఇంకొకరు విమర్శలు చేసుకున్నారు. సిరంజీలు లేవన్న విషయం బల్దియా ఆఫీసర్లకు ముందే  చెప్పామని జిల్లా వైద్యాధికారులు అంటే.. తాము మాత్రం సిరంజీలు ఎక్కడి నుంచి తెస్తామని, అది తమ పని కాదంటూ బల్దియా అధికారులు మండిపడుతున్నారు. అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే జనానికి వ్యాక్సిన్ ఎలా అందిస్తారని టీకాల కోసం వచ్చిన వాళ్లు నిలదీస్తున్నారు. గురువారం ఎల్బీనగర్ సర్కిల్​లోని చంపాపేట్ కమ్యూనిటీ హల్ లో జరిగిందీ సంఘటన.

500 మందిని వెనక్కి పంపేసిన్రు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 60 సెంటర్ల ద్వారా రిస్క్ టేకర్స్ కేటగిరీ వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఒక్కో సెంటర్ లో డైలీ 1,500 మందికి టీకా వేస్తున్నామని ఆఫీసర్లు  చెబుతున్నారు. కానీ ఇందుకు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు. సిరంజీలు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. చంపాపేట్​లో ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్.. సిరంజీలు లేకపోవడంతో కొద్దిసేపటికే నిలిచిపోయింది. సిరంజీలు లేవని, బయటి నుంచి తెచ్చుకోవాలని హెల్త్ స్టాఫ్ సూచించారు. దీంతో క్యూలైన్లలో నిలుచున్న జనం మెడికల్ షాపులకు వెళ్లారు. కానీ కొందరికే దొరికాయి. చంపాపేట్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మెడికల్ దుకాణాల్లో సిరంజీలు మొత్తం అప్పటికే ఖాళీ అయ్యాయి. దీంతో చాలా మందికి దొరకలేదు. దీనిపై అధికారులను జనం ప్రశ్నించడంతో రేపు రావాలంటూ కొద్దిసేపటికే ఆపేశారు. ఈ సెంటర్​లో వ్యాక్సిన్ కోసం ఒకరోజు ముందే 1,200 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా.. 723 మందికి వేశారు. మిగతా వారిని తిప్పి పంపారు.

ఏర్పాట్లు చేయండి.. ప్రచారం తర్వాత..
తమకు వ్యాక్సిన్ వేయకపోవడంపై స్వయం సహాయక బృందాల మహిళలు మండిపడ్డారు. ‘‘ఉదయం 11 గంటలకు వచ్చినం. సిరంజీలు లేవని, కొనుక్కొచ్చుకోవాలని చెప్పిన్రు. సిరంజీలు తెచ్చుకున్నా వ్యాక్సిన్ వేయడం లేదు” అంటూ వాపోయారు. పనులు, ఉద్యోగాలను వదిలి వ్యాక్సిన్ కోసం వస్తే ఇలా చేస్తారా అంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. వ్యాక్సిన్ వేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మానుకుని ఏర్పాట్లు సరిగ్గా చేయాలని అన్నారు.

జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు ముందే చెప్పినం
సిరంజీల కొరత ఉందని మేం జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు ముందే చెప్పినం. ఒక్కో సెంటర్​కి 600 మందిని మాత్రమే రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయాలన్నం. కానీ వెయ్యికి పైగా చేస్తే మేమేం చేయాలె. సిరంజీలు పై నుంచి మాకు రాకపోవడంతోనే కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు చెబుతున్నం.
- డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో, రంగారెడ్డి జిల్లా


మాకేం సంబంధం
వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఏర్పాట్లు చేయడమే మా బాధ్యత. సిరంజీలు తెచ్చుకోవడం హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పని. ప్రతి సెంటర్​లో డైలీ 2 వేల మందికి వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లు ఆదేశించారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లతో పాటు లబ్ధిదారులను గుర్తించి రిజిస్ర్టేషన్లు చేశాం. సిరంజీలు లేవని మాకు ఒకరోజు ముందే చెప్తే రిజిస్ర్టేషన్లు అంత వరకే చేస్తాం.
- నరేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్, ఎల్బీనగర్ సర్కిల్