సెల్‌‌ఫోన్‌‌ ఆర్డర్  పెడితే సబ్బు పంపిన్రు

సెల్‌‌ఫోన్‌‌ ఆర్డర్  పెడితే సబ్బు పంపిన్రు

కారేపల్లి, వెలుగు : ఆన్‌‌లైన్‌‌లో సెల్‌‌ఫోన్‌‌ ఆర్డర్ చేయగా పార్సిల్‌‌లో సబ్బు వచ్చిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కడిమి జగన్‌‌ ఈ నెల 12న మీ షో యాప్‌‌లో నోకియా 2660 మోడల్‌‌ ఫోన్‌‌ను ఆర్డర్ చేశాడు. సోమవారం రూ. 1,066 చెల్లించి పార్సిల్‌‌ తీసుకున్నాడు. తర్వాత దానిని విప్పి చూడగా సబ్బు కనిపించింది. దీంతో డెలివరీ బాయ్‌‌ని నిలదీయడంతో డబ్బు తిరిగి ఇచ్చేశాడు.