నగలు ఏటీఎంలో వేస్తే 12 నిమిషాల్లో పైసలు: వరంగల్లో AI గోల్డ్లోన్ ATM

నగలు ఏటీఎంలో వేస్తే 12 నిమిషాల్లో పైసలు: వరంగల్లో AI  గోల్డ్లోన్ ATM
  • కృతిమ మేధ ఆధారంగానే తూకం, నాణ్యత నిర్ధారణ
  • దేశంలోనే మొట్టమొదటి సారిగా  ఏర్పాటు
  • ఏటీఎం ద్వారా 10%.. మిగతా 90% ఖాతాలో జమ

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గోల్డ్ లోన్ ఏటీఏం దేశంలోనే తొలిసారిగా వరంగల్ లో అందుబాటులోకి వచ్చింది. వరంగల్ లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ దీనిని ప్రారంభించింది. ఏఐ ఆధారిత గోల్డ్ లోన్ సేవలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి.

ఏటీఎం మెషిన్ లో అమర్చిన ఓ బాక్సులో బంగారు ఆభరణాలు  నాణ్యత, బరువు ఏఐ సాంకేతిక ఆధారంగా నిర్ధారిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధరను అంచనా వేసి ఎంత రుణం వస్తుందో డిస్ ప్లే అవుతుంది. మనం అంగీకరించగానే 10% నగదు ఏటీఎం నుంచి విత్ డ్రా అవుతుంది.

ఈ ప్రాసెస్ అంతా 12 నిమిషాల్లో జరిగిపోతుంది. మిగతా 90% నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.  ఈ సేవను ఉపయోగించుకోవడానికి వినియోగదారులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారులు అయి ఉండాలి.

ALSO READ | స్వశక్తితో మనల్ని మనమే రక్షించుకోవాలి:మహిళలకు సరోజావివేక్ పిలుపు

ఏఐ ఆధారిత గోల్డ్ లోన్ల వల్ల అప్రైజర్లు నాణ్యత, బరువు నిర్ధారించాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు కస్టమర్ గోల్డ్ లోన్ కోరుకున్న కొద్ది నిమిషాల్లోనే నగదు పొందేందుకు వీలుంటుంది.