వరంగల్, వెలుగు: “ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంది.. కొందరు గ్రామసభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అలాంటివారి తోలుతీస్తా”.. అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం హనుమకొండలోని అశోక కన్వెన్షన్ హాల్‍లో ప్రెస్‍మీట్ నిర్వహించి ఆయన మాట్లాడారు. బీఆర్‍ఎస్ పదేండ్ల పాలనలో చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేస్తోందని పేర్కొన్నారు.
కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే పథకాలపై గ్రామసభల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రెండంతస్తుల బిల్డింగ్, రెండు కార్లున్నోళ్లకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలా..? అంటూ ఆయన మండిపడ్డారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి, తాము వచ్చాక చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. ఏనుమాముల మార్కెట్ నుంచి ఇన్నర్ రింగ్‍రోడ్ వరకు 200 ఫీట్ల బైపాస్ రోడ్డులో అలైన్‍మెంట్ మార్చారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇష్టారీతిన అలా మార్చితే వదలమన్నారు.
రెండు మూడు రోజుల్లో వరంగల్ మాస్టర్ ప్లాన్ ఒరిజినల్ కాపీని అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్‍ఖాన్, కార్పొరేటర్లు ఉన్నారు.