Good Health : 21 రోజులు మందు మానేస్తే మీ ఆరోగ్యం ఇలా బాగుపడుతుంది..!

Good Health : 21 రోజులు మందు మానేస్తే మీ ఆరోగ్యం ఇలా బాగుపడుతుంది..!

మనకు ఉండే అలవాట్లతోనే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మన అలవాట్లను వల్ల శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి. కొన్ని మార్పులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని మార్పులు చాలా ప్రతికూల పరిణామాలను కలిగి ఉంటాయి.  మద్యపానం, ధూమపానం ఆపేయడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇలాంటి అలవాటును కొద్దిరోజులు మానుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ప్రధానంగా ఆల్కహాల్ అలవాటును మానుకుంటే మరీ మంచిది. వరుసగా 21 రోజులు మద్యం సేవించకపోతే శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం..

21 రోజుల ఛాలెంజ్: మద్యం తాగితే వచ్చే సమస్యలు మన అందరికీ తెలుసు. కానీ అంత ఈజీగా మనేయరు. 21 రోజుల పాటు మద్యం మానేస్తే చాలా ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.    21 రోజులు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుంది. మీరు ఆల్కహాల్ కంటే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మీకు రుచికరమైనది తినాలనే కోరిక ఉంటుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మద్యం అలవాటు ఉన్న వారిలో సగటు వ్యక్తి సంవత్సరానికి 9.5 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొందరు అప్పుడప్పుడు తాగేవారు ఉన్నారు. 21 రోజుల పాటు మద్యాన్ని మానేయకపోతే శరీరంపై అనేక ప్రభావాలు ఏర్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 

నిద్రలేమి సమస్యలకు చెక్ :  మందు కొట్టి నిద్రపోతే చెత్త పీడకలలు వస్తాయి. కానీ మందు కొట్టకపోతే అలాంటి కలలు రావు. కలలు చాలా ఆహ్లాదకరంగా మారతాయి. అయితే నిత్యం మందు తాగేవారికి 21 రోజుల పాటు దీన్ని నివారించడం కాస్త కష్టమే. ఇది చాలా మందిలో నిద్రలేమిని కూడా కలిగిస్తుంది. అయితే మద్యం ఎక్కువగా తాగినా నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. మద్యం ఎక్కువైతే పడుకున్నాక రాత్రిపూట దాహం ఎక్కువగా వేస్తుంది. చాలాసార్లు అర్ధరాత్రి లేవాల్సి వస్తుంది.మందు 21 రోజులపాటు మానేస్తే.. మొదటి వారంలో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాలేయం కొద్దికొద్దిగా శుభ్రపరచడం ప్రారంభమవుతుంది. జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.

జీర్ణసమస్యలు క్లియర్ అవుతాయి : మద్యపానం మానేసిన తర్వాత, జీర్ణవ్యవస్థ మునుపటి కంటే మరింత సాఫీగా పనిచేయడం ప్రారంభిస్తుంది. కడుపులో ఆమ్లం మొత్తం సమతుల్యంగా ఉంటుంది. మందు తాగడం మానేసిన 2 వారాల తర్వాత ఈ మార్పు వస్తుంది. మీరు ఆల్కహాల్ తాగడం మానేసిన తర్వాత, మీ శరీరం సాధారణ స్థితికి రావడం మెుదలవుతుంది. ఆ విధంగా ఇది మీకు మంచి నిద్రను ఇస్తుంది. మీరు ఉదయాన్నే నిద్ర లేచేలా చేస్తుంది. అవయవాలు సజావుగా పని చేస్తాయి. దంతాలు మునుపటి కంటే బలంగా తయారవుతాయి. మద్యపానం మానేయడం వల్ల దంతక్షయం నివారించవచ్చు. అలాగే దంతాలను దృఢంగా మార్చడంతోపాటు పళ్లను తెల్లగా మార్చుతుంది. వాసన తగ్గడం ప్రారంభమవుతుంది.

ముఖంలో మార్పులు : మద్యపానం 21 రోజులు ఆపేస్తే.. మీ ముఖంలో చాలా మార్పులు మొదలవుతాయి. గతంలో ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండదు. కానీ తాగడం ఆపిన మొదటి వారం తర్వాత సాధారణ రక్తస్రావం ఉంటుంది. ఇది ముఖం ముడతలు, నల్ల మచ్చలు మొదలైన వాటిని కూడా నివారిస్తుంది. తొలిదశలో కొంచెం కష్టమైనా 28 రోజుల పాటు ఇలా పాటిస్తే ఆరోగ్యం గతంలో కంటే చాలా రెట్లు మారిపోవడం ఖాయం. రక్త ప్రసరణకు ఆటంకం కలగకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. మద్యం ఆపేస్తే ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే మెుదలుపెట్టండి.

కాలేయం.. గుండె పనితీరు వృద్ది: మీరు మద్యం సేవించడం మానేస్తే.. దెబ్బతిన్న కాలేయాన్ని సరిచేయవచ్చు. నిత్యం ఆల్కహాల్ తీసుకుంటే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రమంగా కాలేయం క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు నియంత్రంచుకొని.. మందు తాగడం తగ్గించుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఇలా చేయడం వల్ల మీ కాలేయం తిరిగి సాధారణ స్థితికి రావచ్చు. ఆల్కహాల్ కూడా గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మీరు 21 రోజుల పాటు మద్యం సేవించకపోతే.. మీ గుండెపై సానుకూల ప్రభావం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్స్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

లివర్ కూడా సేఫ్: మద్యం తాగితే లివర్ పాడవ్వడం గ్యారెంటీ. కానీ మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. అది పాడైనట్లయితే దాదాపు అన్ని అవయవాలు పనిచేయవు. అదే మద్యం తాగడం మానేస్తే లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దానిలో లోపాల్ని అదే సరిచేసుకుంటుంది. శారీరంలో విష వ్యర్థాలను బయటకు పంపుతుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. హార్మోన్లను తగ్గిస్తుంది. ఎలా ఎన్నో మంచి పనులను చేసే లివర్ బాగుండాలంటే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. 

 బరువు అదుపులో ఉంటుంది: మద్యం తాగేవారిలో ఎలాంటి కంట్రోల్ ఉండదు. తాగుతూనే ఉంటారు. పైగా మంచింగ్ పేరుతో కొవ్వు ఉండే స్నాక్స్ తింటుంటారు. ఇవన్నీ కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. పొట్ట ఇతరత్రా శరీర భాగాల్లో పేరుకుపోతుంది. దీంతో బరువు పెరుగుతారు. ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే బరువు తగ్గుతారు. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థను పాడు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతో మీరు అనారోగ్యంతోపాటు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగడం మానేస్తే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే రోగనిరోధక శక్తిపై ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాదు న్యుమోనియా, సెప్సిస్, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 

 మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది: ఆల్కహాల్ కు మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మద్యం తాగడం మానేస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆల్కహాల్ మానేస్తే ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గుతాయి. మానసిక పరిస్ధితి మెరుగుపడుతుంది.

 శక్తివంతంగా ఉంటారు: మద్యపానం నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది మరుసటి రోజు మీ మానసిక స్థితి, శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. జర్నల్ స్లీప్ అండ్ విజిలెన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అధిక ఆల్కహాల్ వినియోగం మరుసటి రోజు పగటి నిద్రను గణనీయంగా పెంచుతుంది. 35% మంది ముందు రోజు రాత్రి తాగిన తర్వాత మేల్కొని ఉండడం లేదా మెలకువగా ఉండాలనే ఆసక్తిని కోల్పోయినట్లు నివేదించారు. 5% కంటే తక్కువ మంది సాధారణ రోజుల్లో అదేభావాలను కలిగి ఉన్నారని పేర్కొంది. 

ALSO READ | కొవ్వు కాలేయంతో బాధపడుతున్నారా?.. ఈ ఆహారంతో మంచి ఫలితాలు