Credit Card payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్..ఈ తప్పు చేస్తే.. భారీగా ఫైన్ చెల్లించాల్సిందే..

Credit Card payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్..ఈ తప్పు చేస్తే.. భారీగా ఫైన్ చెల్లించాల్సిందే..

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది..ఆన్లైన్, ఆఫ్లైన్ షాపింగ్..ఏదైనా బిల్లులు చెల్లించాలన్నా..ప్రతిచోటా క్రెడిట్ కార్డును వినియోగిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.మరీ ముఖ్యంగా  క్రిడెట్ కార్డు చెల్లింపు విషయంలో లేకపోతే పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల పెద్ద నిర్ణయమే తీసుకంది. క్రెడిట్ కార్డు డీఫాల్ట్ పై 30 శాతం కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. 

సుప్రీంకోర్టు ఇటీవల క్రెడిట్ కార్డు పెనాల్టీ ఫీజులకు సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకుంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) 2008 ఉత్తర్వులను రద్దు చేసింది. NCDRC 2008 ఉత్తర్వుల ప్రకారం.. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులో జాప్యంపై బ్యాంకులు కేవలం 30 శాతం వడ్డీ  మాత్రమే వసూలు చేయాలి. సుప్రీంకోర్టు ఈ లిమిట్ ను రద్దు చేసింది. క్రెడిట్ కారడు డీఫాల్టర్లనుంచి అధిక వడ్డీని వసూలు చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీనర్థం.. క్రెడిట్ కార్డు జారీ చేసే బ్యాంకు 30 నుంచి 50 శాతం వరకు వడ్డీని వసూలు చేయొచ్చు. 

Also Read : ఎయిర్‌టెల్ నెట్‌వర్క్​ డౌన్.. కోట్ల మంది కస్టమర్ల గగ్గోలు

NCDRC 30 శాతం లిమిట్ ను విధించినప్పటి నుంచి క్రెడిట్ కార్డు జారీ చేసే అన్ని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ లిమిట్ ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 30 శాతం లిమిట్ తో క్రెడిట్ కార్డు డిఫాల్టర్ల నుంచి సమర్థవంతంగా వసూలు చేయలేకపోతున్నామని బ్యాంకులు వాదించాయి. వాదనలు విన్న సుప్రీంకోర్టు బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇది క్రెడిట్ కార్డు కస్టమర్లకు పెద్ద షాకే.. 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. 

  • క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా ఉండొద్దు.. 
  • బిల్లులు చెల్లించిన తర్వాత  మీ బ్యాంకు ఎంత వడ్డీని వసూలు చేసిందో గమనించాలి
  • సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తే CIBIL స్కోర్ కూడా ఫైనాన్షియల్ హెల్దీగా ఉంటుంది.
  • క్రెడిట్ కార్డు డిఫాల్ట్  మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం చేస్తుంది. 
  • భవిష్యత్తులో బ్యాంకులనుంచి రుణాలు పొందడం కష్టతరమవుతుంది