కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే

పాతవి వదిలేయాలని మెలిక

ఈ నెలలోనే స్క్రాపేజీ పాలసీ ప్రకటిస్తాం
దీనివల్ల ఆటోమొబైల్‌ కంపెనీలకు ఎంతో మేలు
లోకల్‌ తయారీ కాంపోనెంట్స్‌‌కు ఇంపార్టెన్స్‌‌ ఇవ్వాలి: గడ్కరీ

న్యూఢిల్లీ: వెహికల్‌‌ స్క్రాపేజీ పాలసీ తయారీ దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే దీనిపై అఫీషియల్‌‌గా ప్రకటన చేస్తామని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ స్కీమ్‌‌ అమల్లోకి వస్తే పాత వెహికిల్స్‌‌ను తుక్కుగా (స్క్రాప్‌‌) మార్చే కస్టమర్లకు డిస్కౌంట్లు/ఇన్సెంటివ్స్‌‌ ఇస్తారు. ఆటో ఇండస్ట్రీ కోలుకోవాలంటే ఈ పాలసీ చాలా ముఖ్యమని గడ్కరీ చెప్పారు. దీనివల్ల అటు వెహికల్‌‌ కొనుగోలుదారులకు, ఇటు ఆటోమొబైల్‌‌ కంపెనీలకూ మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. పాత వాహనాలను వదిలేస్తే కొత్త వాటికి డిమాండ్‌‌ కచ్చితంగా పెరుగుతుందన్నారు. ఆటోమొబైల్‌‌ కంపెనీలు విడిభాగాలను ఫారిన్ నుంచి తెప్పించకుండా, మనదేశంలో దొరికేవాటినే ఉపయోగించుకోవాలని  పిలుపునిచ్చారు. ఫారిన్‌‌ కాంపోనెంట్స్‌‌కు సరిపోయే వాటిని ఇక్కడే డెవలప్‌‌చేసుకోవాలని సూచించారు. ఐదేళ్లలో ఇండియాకు గ్లోబల్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ హబ్‌‌గా ఎదిగే సత్తా ఉందని అన్నారు. ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ కంపెనీల ఎగుమతులను మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎంఎస్‌‌ఎంఈల నిర్వచనం మార్చడం వల్ల చిన్న ఇండస్ట్రీలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ఆటో కాంపోనెంట్స్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ ‘‘మీ అందరినీ రిక్వెస్ట్‌‌ చేస్తున్నా! దిగుమతులను ఎంకరేజ్‌‌ చేయకండి. మనదేశంలోనే వాటిని తయారు చేసే మార్గం వెతకండి. మీకు ఆ సత్తా ఉంది. కాంపోనెంట్స్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ సెక్టార్‌‌ ప్రొడక్షన్‌‌ను, టెక్నాలజీని, క్వాలిటీని మెరుగుపర్చుకోండి. మన దగ్గర తక్కువ జీతాలకే కూలీలు దొరుకుతారు.   జీడీపీలో మీ వాటాను మరింత పెంచండి. ఆత్మనిర్భర్‌‌ భారత్‌‌ సాధనలో మీ పాత్ర చాలా ముఖ్యం’’ అని ప్రకటించారు.

కంపెనీలకు ఇన్సెంటివ్స్‌‌ ఇస్తాం: అమితాబ్‌‌ కాంత్‌‌

ఆటోమొబైల్‌‌, కాంపోనెంట్స్‌‌ తయారీ కంపెనీలకు ప్రొడక్షన్‌‌ లింక్డ్‌‌ ఇన్సెంటివ్స్‌‌ (పీఎల్‌‌ఐ) ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నామని నీతి ఆయోగ్‌‌ సీఈఓ అమితాబ్‌‌ కాంత్‌‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ రెండు సెక్టార్లను వీలైనంత ఎక్కువగా ఎంకరేజ్‌‌ చేస్తామని వెల్లడించారు. వెహికల్‌‌ స్క్రాపేజీ పాలసీపై దాదాపు తుది నిర్ణయం తీసుకున్నామని, దీనిపై మంత్రులు చర్చిస్తున్నారని ఆయన చెప్పారు.  డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ హెవీ ఇండస్ట్రీ కూడా ఇది వరకే ఆటో, ఆటో కాంపోనెంట్స్‌ కంపెనీలతో మాట్లాడిందని కాంత్‌‌ చెప్పారు. పీఎల్‌‌ఐ స్కీమ్‌‌ను పెద్ద ఎత్తున అమలు చేస్తామన్నారు.  ‘‘టెక్నాలజీ, డిజిటైజేషన్‌‌ వంటి ఆధునిక పద్ధతులకు మారే కంపెనీలే నిలదొక్కుకుంటాయి. చాలా కంపెనీలు గేర్‌‌ బాక్సులను, ట్యూబ్‌‌లను, స్టీరింగ్‌‌ వీల్స్‌‌ను విదేశాల నుంచి కొంటున్నాయి. వీటిని ఇక్కడే తయారు చేయడానికి ఎలాంటి అడ్డంకులూ లేవు. వీటిని దిగుమతి చేసుకోవడం అనవసరం’’ అని కాంత్‌‌ స్పష్టం చేశారు.

For More News..

అడిగినోళ్లందరికీ కరోనా టెస్టులు

హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అజరుద్దీన్​పై మెంబర్స్​ తిరుగుబాటు!

డ్రైవింగ్ స్కూళ్లు స్టార్ట్ చేస్తున్న ఆర్టీసీ.. ఫీజు ఎంతంటే..