ఫ్రీ వాటర్​కు కావాలంటే.. ఆధార్ అప్ డేట్ చేసుకోవాలె

ఫ్రీ వాటర్​కు కావాలంటే.. ఆధార్ అప్ డేట్ చేసుకోవాలె

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లో  ఒక్కో ఇంటికి నెలకు 20వేల లీటర్ల ఫ్రీ వాటర్​ స్కీమ్​ కింద  ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని వాటర్ బోర్డు సూచించింది.  మార్చి 31లోగా ఆధార్ లింకేజీ, మీటర్ లేనివారు అప్లై చేసుకుంటేనే స్కీమ్​వర్తించనుంది. ఇప్పటికే ఆధార్​లింకేజ్, మీటర్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వినియోగ‌‌‌‌దారులు త‌‌‌‌మ క్యాన్ నెంబ‌‌‌‌ర్లతో ఆధార్ ను లింక్ చేసుకోవ‌‌‌‌డానికి www.hyderabadwater.gov.in  వెబ్ సైట్ ను లేదా మీ సేవ సెంట‌‌‌‌ర్ కు వెళ్లి చేసుకోవచ్చు. సందేహాల కోసం 155313, 040-2343 3933 నంబర్లలో ఫోన్​ చేసి తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. బల్దియా పరిధిలో ప్రభుత్వం ప్రకటించిన ఫ్రీ వాటర్​స్కీమ్​ను మంగళవారం మంత్రి కేటీఆర్ రెహమత్ నగర్ లోని ప్రగతి నగర్ పరిధిలో  ప్రారంభిస్తారు. ఉదయం 9.30గంటలకు జరిగే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ స్కీం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు.