రెస్టారెంట్, హోటల్ లేదా కేఫ్‌కి వెళ్లాలంటే చేతిలో డబ్బుంటే సరిపోతుంది. కానీ, జైపూర్‌లోని ఈ రెస్టారెంట్‌కి వెళ్లాలంటే మాత్రం డబ్బుతో పాటు పక్కన గర్ల్ ఫ్రెండ్ లేదంటే భార్య ఉండాల్సిందే. ఒకవేళ ఎవరూ లేదంటే మొహమాటం లేకుండా గేటు బయట నుంచే గెట్ అవుట్ అనేస్తాడు సెక్యూరిటీ గార్డ్. ఈ రెస్టారెంట్ రూల్స్ అలాంటివి మరి. టైంతో పాటు ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. ప్రజెంట్ ట్రెండ్స్‌కి తగ్గట్టే కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాయి రెస్టారెంట్లు, హోటల్స్. అలా ఈ మధ్య జైపూర్‌లోని ఓ రెస్టారెంట్ కూడా కొంచెం వెరైటీగా ఆలోచించింది. ‘మా రెస్టారెంట్లో మగవాళ్లు తినాలంటే ఆడవాళ్లని వెంటబెట్టుకుని రావాల్సిందే’ అనే రూల్ పెట్టింది. ఇదే విషయాన్ని రెస్టారెంట్ గోడలతో పాటు ఏసీపైనా రాసి మరీ చెబుతోంది. దాన్ని ఫొటో తీసి హర్షిత శర్మ అనే మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నా ఫ్రెండ్ నన్ను ఎందుకు ఈ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడో అర్థమయ్యింద’ని ఆ ఫొటో కింద ఫన్నీ క్యాప్షన్ పెట్టింది. అంతే... కొద్ది నిమిషాల్లోనే ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. వేలల్లో లైక్స్ కూడా వచ్చాయి. చాలామంది దీన్ని రీ ట్వీట్ చేస్తున్నారు. పోటీలు పడి మరీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకరైతే ఏకంగా ఈ రెస్టారెంట్ వెతికి పట్టుకుని దీని పేరు ‘గోపీ భోజనాలయం’ అని ట్విట్టర్లో దండోరా వేశారు. ఇంకొందరు తమ ఏరియాలో ఉన్న ఇలాంటి స్పెషల్ రెస్టారెంట్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రెస్టారెంట్‌కి మాత్రం ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరికింది. కానీ, లేడీస్ ఉంటేనే ఎంట్రీ ఏంటన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. రెస్టారెంట్ వాళ్లు కూడా ఏం చెప్పలేదు.
భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే ఆ రెస్టారెంట్లోకి ఎంట్రీ.!
- లైఫ్
- October 21, 2021
లేటెస్ట్
- ప్రోమో రిలీజ్.. అన్‌స్టాపబుల్ షోలో డాకు మహారాజ్ తో గేమ్ ఛేంజర్..
- సింగరేణిని రాజకీయాలకు వాడం.. బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి
- IND vs AUS: ప్రతి ఒక్కరూ ఆ రూల్ పాటించాల్సిందే.. టీమిండియా క్రికెటర్లకు గంభీర్ వార్నింగ్
- శబరి కొండ కిట కిట.. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలు
- మినీ చాపర్ తో కూరగాయలు స్పీడ్ గా కట్ చేసుకోవచ్చు
- చలిగా ఉందా? పోర్టబుల్ రూమ్ హీటర్ వాడండి ..మూడు సెకన్లలోనే రూమ్ వేడెక్కుతది
- డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్.. కింగ్ ఆఫ్ జంగల్ అంటున్న బాలయ్య..
- టూల్స్ & గాడ్జెట్స్: ఆటోమెటిక్ డస్ట్‌బిన్ ..ఎక్కడైనా ఈజీగా వాడొచ్చు
- లోపలి మనిషిని చూపించే అంతరంగ వీక్షణం
- చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..
- Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్‌లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- Video Viral: తండ్రి రామ్ చరణ్‌ని తొలిసారి టీవీలో చూస్తూ మెగా ప్రిన్సెస్ క్లీంకార కేరింతలు
- 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా