చదువు నేర్పించమంటే దొంగతనం నేర్పిండు.. జీడిమెట్లలో ట్యూషన్ టీచర్పై ఓ తండ్రి ఫిర్యాదు

చదువు నేర్పించమంటే దొంగతనం నేర్పిండు.. జీడిమెట్లలో ట్యూషన్ టీచర్పై ఓ తండ్రి ఫిర్యాదు

జీడిమెట్ల, వెలుగు: చదువు కోసం ట్యూషన్​కు పంపిస్తే తన కొడుకును టీచర్​దొంగగా మార్చాడని ఓ తండ్రి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపూర్​నగర్ హెచ్ఎంటీ సోసైటీకి చెందిన కమల్​జైన్​బిజినెస్​చేస్తున్నాడు. ఆయనకు ఏడో తరగతి చదువుతున్న కొడుకు (13) ఉండగా, చదువులో ముందుండడానికి షాపూర్​నగర్​లోని సందీప్​అనే వ్యక్తి వద్దకు ట్యూషన్​ పంపిస్తున్నాడు. 

ఇటీవల కమల్​ జైన్​కు తన కొడుకు వద్ద ఐఫోన్16 కన్పించింది. ఫోన్​ఎక్కడిదని ప్రశ్నించగా, తమ ట్యూషన్​ టీచర్​ఇచ్చాడని బాలుడు బదిలిచ్చాడు. డబ్బుల గురించి ఆరా తీయగా,  తండ్రి షాపులోంచి అప్పడప్పుడు డబ్బులు తీసుకెళ్లి ట్యాషన్​టీచర్​కు దాదాపు రూ.2 లక్షల వరకూ ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో సదరు టీచర్​పై బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు

జీడిమెట్ల పోలీసుల తీరుపై కమల్​ జైన్​పలు ఆరోపణలు చేశాడు. తన కొడుకుకు దొంగతనం నేర్పించిన ట్యూషన్​టీచర్​పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. కేసు నమోదు చేయకపోగా, ఓ ఎస్ఐ బూతులు తిట్టాడని ఆరోపించారు. కాంప్రమైస్​కావాలని తనతోపాటు తన కొడుకును పీఎస్​కు పిలిచి తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారన్నారు. 

దీంతో హుమన్​రైట్స్​కమిషన్​ను సైతం ఆశ్రయించినట్లుపేర్కొన్నారు. ఈ విషయమై జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్​ని వివరణ కోరగా, ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే తాము కేసు నమోదు 
చేసినట్లు తెలిపారు.