అక్కడ ఎగ్జామ్ రాయాలంటే..కుర్తా పైజామా కంపల్సరీ

అక్కడ ఎగ్జామ్ రాయాలంటే..కుర్తా పైజామా కంపల్సరీ
  • పోటీ పరీక్షలకు రాజస్థాన్​లో కోడ్

జైపూర్: రాజస్థాన్​లో ప్రభుత్వ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ బోర్డు(ఆర్​ఎస్​ఎస్​బీ) డ్రెస్ కోడ్ పెట్టింది. అబ్బాయిలు కుర్తా పైజామాలోనే రావాలని చెప్పింది. 

మాల్ ప్రాక్టీస్​ను కంట్రోల్​ చేయడంలో భాగంగా మెటల్ చైన్లు, మెటల్ జిప్పులు ఉన్న ప్యాంట్లు, జాకెట్స్​ ధరించొద్దని కండిషన్​ పెట్టింది. పేపర్ లీక్​లపై ఆందోళనలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​ఎస్​ఎస్​బీ చైర్మన్ అలోక్ ​రాజ్ చెప్పారు. 

కాగా, కొత్త రూల్స్​పై నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు. ఎగ్జామ్స్ కోసం కుర్తా పైజామా కొనడం పేద విద్యార్థులకు భారంగా మారుతుందని వాపోతున్నారు.