మతసామరస్యానికి ఇఫ్తార్ ప్రతీక : బీర్ల ఐలయ్య,

మతసామరస్యానికి ఇఫ్తార్ ప్రతీక : బీర్ల ఐలయ్య,

యాదాద్రి, యాదగిరిగుట్ట, హాలియా, వెలుగు : రంజాన్ మాసంలో చేపట్టే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగరి, యాదగిరిగుట్టలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందులో వారు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సంబంధాలు, బంధాలు బలపడటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. పండుగ ఏదైనా కుల, మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆస్వాదించడం తెలంగాణ ప్రజల ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఇలాంటి విందులతో ప్రజల మధ్య అనుబంధాలు మరింత ధృడమవుతాయని తెలిపారు. మరోవైపు నల్గొండ పట్టణంలోని లక్ష్మీనరసింహ గార్డెన్​లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాజర్యారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.