లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్

లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్

నస్పూర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్ టీయూ) ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ ముందు మంగళవారం  ధర్నా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్ కు వినతిపత్రం అందించి ఐఎఫ్​టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను మార్చి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి చాలా ప్రమాదకరమన్నారు. 

దేశానికి లక్షల కోట్ల లాభాలను సమకూర్చి పెట్టే ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకే కార్మిక చట్టాలను మార్చారని ఆరోపించారు. కార్మికులు నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను దేశంలోని పెట్టుబడిదారుల కోసం బీజేపీ ప్రభుత్వం మార్చిందని ఫైర్​ అయ్యారు. ఈ విధానాన్ని ఐఎఫ్ టీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్​టీయూ జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎండీ జాఫర్, నాయకులు మల్లన్న, సదానందం, సోమన్న, గణేశ్, సాజిద్, అరుణ, శోభ, సునీత తదితరులు పాల్గొన్నారు.