సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఐజీ చంద్రశేఖర్​రెడ్డి

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఐజీ చంద్రశేఖర్​రెడ్డి
  • ఐజీ చంద్రశేఖర్​రెడ్డి 

కామారెడ్డిటౌన్, వెలుగు: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని, లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలకమని ఐజీ చంద్రశేఖర్​రెడ్డి పేర్కొన్నారు.  గురువారం కామారెడ్డి టౌన్​ పీఎస్‌‌ పరిధిలో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలతోపాటు కమాండ్​ కంట్రోల్​రూమ్‌‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ  సీసీ కెమెరాల ద్వారా  చాలావరకు నేరాలు తగ్గుతున్నాయన్నారు. దొంగతనాలు చేసే వాళ్లు కూడా భయపడుతారన్నారు. 

 ఏదైనా ఘటన జరిగినప్పుడు  నిందితుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా ఉంటున్నాయన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన వారిని ఆయన అభినందించారు. అనంతరం పోలీస్​స్టేషన్‌‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అంతకుముందు దేవునిపల్లి పీఎస్‌‌లో ఏర్పాటు చేసిన చిన్నారుల పార్క్​ను ప్రారంభించారు.  పిల్లలకు బుక్స్​ పంపిణీ చేశారు.  ఆయన వెంట ఎస్పీ సింధూశర్మ, ఏఎస్పీలు చైతన్యరెడ్డి, నరసింహారెడ్డి,  సీఐలు చంద్రశేఖర్​రెడ్డి, రామన్​, ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.