గోదావరిఖని టూటౌన్ ​ఎస్సై సోనియా సస్పెన్షన్‌‌‌‌

గోదావరిఖని టూటౌన్ ​ఎస్సై సోనియా సస్పెన్షన్‌‌‌‌
  • కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ ఎస్సైగా పనిచేస్తున్న టైంలో ఓ కేసు విషయంలో ఆరోపణలు
  • ఎస్సైతో పాటు ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌‌‌‌ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ

ఆసిఫాబాద్‌‌‌‌/గోదావరిఖని, వెలుగు : ఓ కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ ఎస్సైగా పనిచేసిన అప్పాస్‌‌‌‌ సోనియాతో పాటు ఏఎస్సై, ఇద్దరు హెడ్‌‌‌‌కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌‌‌‌ వేటు పడింది. సోనియా ప్రస్తుతం గోదావరిఖని టూటౌన్‌‌‌‌ ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆగస్ట్‌‌‌‌ 3న కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలోని బురదగూడలో కొట్రంగి శ్యామ్‌‌‌‌రావు అనే వ్యక్తి చనిపోయాడు. మంచం మీది నుంచి కింద పడి చనిపోయినట్లు అతడి ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు అప్పటి ఎస్సై సోనియా కేసు నమోదు చేశారు. 

అయితే కేసును పక్కదారి పట్టించేందుకు ఎస్సై లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడం, శ్యామ్‌‌‌‌రావు మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆర్డీవో సమక్షంలో రీపోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించారు. అందులో శ్యామ్‌‌‌‌రావు ఒంటిపై 9 చోట్ల దెబ్బలు ఉన్నట్లు తేలింది. దీంతో ఎస్సై ఉద్దేశపూర్వకంగా డబ్బులు తీసుకొని కేసును తప్పుదోవ పట్టించినట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు రిపోర్ట్‌‌‌‌ ఇచ్చారు. ఈ మేరకు ఎస్సైతో పాటు ఏఎస్సై మను, హెడ్ కానిస్టేబుళ్లు జే.రమేశ్, ఆర్.ఉమేశ్‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌ చేస్తూ మల్టీ జోన్‌‌‌‌ 1 ఐజీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.