ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీస్‌‌ హెడ్‌‌ క్వార్టర్స్‌‌

ములుగు/వరంగల్‌‌, వెలుగు : ప్రజలకు అందుబాటులో ఉండేలా ములుగు జిల్లా పోలీస్‌‌ హెడ్ క్వార్టర్స్‌‌ను నిర్మిస్తామని పోలీస్‌‌ హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ ఎండీ, ఐజీ ఎం.రమేశ్‌‌ చెప్పారు. ములుగు గట్టమ్మ ఆలయం సమీపంలో జిల్లా పోలీస్‌‌ ఆఫీస్‌‌కు కేటాయించిన స్థలాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు చెప్పుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని, వారికి అందుబాటులో ఉండేలా ఆఫీస్‌‌ను నిర్మించాలని చెప్పారు.

మెయిన్‌‌ రోడ్డుకు సమీపంలో ఆఫీస్‌‌, తర్వాత పరేడ్‌‌ గ్రౌండ్‌‌, క్వార్టర్స్‌‌ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ శబరీశ్‌‌, అడిషనల్‌‌ ఎస్పీ సదానందం, చీఫ్‌‌ ఇంజినీర్‌‌ తులసీధర్‌‌, ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజినీర్‌‌ టి.శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాజా అబ్దుల్‌‌ అజీజ్, ఐదవ బెటాలియన్‌‌ డీఎస్పీ సుమనినాయక్‌‌ ఉన్నారు. అంతకుముందు ఆయన మామునూరులోని నాలుగో బెటాలియన్‌‌ను, అమ్మవారిపేట వద్ద ఉన్న ఫైరింగ్‌‌ రేంజ్‌‌ను సందర్శించారు.