హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన వారిలో 19 మందికి అసలు భూమే లేదని ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో కొందరికి భూమి ఉన్న వాళ్ల ల్యాండ్ భూసేకరణ పరిధిలోకి రాదని క్లారిటీ ఇచ్చారు. వికారాబాద్ కలెక్టరేట్లో బుధవారం (నవంబర్ 13) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల దాడి ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడని.. సాంకేతిక ఆధారాలు లభ్యం కావడంతోనే అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రాళ్లు, కర్రలు, కారంపొడి తీసుకొచ్చినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనలో ఫొటోస్, ప్రత్యేక సాక్షులు, వీడియోల ద్వారా మొత్తం 47 మందిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొందరిని గుర్తించాల్సి ఉందన్నారు. 47 మందిని విచారించి అందులో 21 మందిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించామని తెలిపారు.
ALSO READ | Ranji Trophy 2024-25: సచిన్ కొడుకు అదరహో.. 5 వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండూల్కర్
మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి గ్రామంలో తీసుకెళ్లిన ప్రధాన నిందితుడు సురేష్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. లగచర్ల ఘటనలో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని.. నిందితులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దర్యా్ప్తు త్వరగా పూర్తి చేసి చార్జిషీట్ ఫైల్ చేస్తామని పేర్కొన్నారు. చాలామంది రైతులను విచారించి వదిలిపెట్టామన్నారు.