హైదరాబాద్ మెట్రోకు ఐజీబీసీ ప్లాటినమ్ సర్టిఫికెట్

హైదరాబాద్​సిటీ, వెలుగు : హైదరాబాద్ మెట్రో రైలుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఎంఆర్టీఎస్ ప్లాటినమ్ సర్టిఫికెట్ దక్కింది. మూడు కారిడార్ల పరిధిలోని 57 స్టేషన్ల మెట్రోకు ఐజీబీసీ ప్లాటినమ్​సర్టిఫికెట్​దక్కడం దేశంలో మొదటిసారి అని మెట్రో, ఎల్​అండ్​టీ అధికారులు వెల్లడించారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్​అందుకున్నట్లు తెలిపారు.