కంప్లయింట్స్​ను పట్టించుకుంటలె

కంప్లయింట్స్​ను పట్టించుకుంటలె

45 రోజుల్లో 31,622 అందితే..16 వేలలోపే సాల్వ్
నెలలుగా పరిష్కరిం చని అధికారులు

గోల్కొండ ఏరియా లోని శివాలయం సమీపంలో స్ట్రీట్ లైట్లు పని చేయడం లేదని ఆరు నెలలుగా సాయి అనే వ్యక్తి మై జీహెచ్ఎంసీ యాప్​లో కంప్లయింట్లు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదు. ప్రాబ్లమ్​సాల్వ్​ చేయడం లేదు. ’’రాము ప్రైవేటు ఎంప్లాయ్.  బైక్​పై కోఠి నుంచి పంజాగుట్ట వెళ్తున్నాడు.  పంజాగుట్ట సమీపంలో రోడ్డుపై మ్యాన్​హోల్​ గుంత ఉంది. అతడు దానిపై నుంచి వెళ్లడంతో బైక్​ స్కిడ్​ అయ్యింది. దీనిపై బల్దియా టోల్​ ఫ్రీ నంబర్​కు కాల్ ​చేసి ప్రాబ్లమ్ ​చెప్పాడు. రెండు వారాలు దాటినా పరిష్కరించలేదు.

హైదరాబాద్​,వెలుగు: జీహెచ్‌‌ఎంసీకి గత నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 45 రోజుల్లో 31,622 కంప్లయింట్స్​ వచ్చాయి. ఇందులో 16,365  పరిష్కరించినట్టు జీహెచ్ఎంసీ గ్రీవెన్స్​ రిపోర్టులో పేర్కొంది. మరో 15,957 పెండింగ్‌‌లో ఉన్నాయి. మై జీహెచ్‌‌ఎంసీ యాప్‌‌, కాల్‌‌ సెంటర్‌‌, డయల్‌‌ 100, ట్విటర్‌‌, గ్రీవెన్స్‌‌ రీడ్రెసల్‌‌ సిస్టమ్‌‌​, కమిషనర్ పేషీతో పాటు వివిధ రకాలుగా కంప్లయింట్లు  వస్తుంటాయి. వాటి పరిష్కారం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. సాల్వ్​ చేసిన వాటికి  కాల్‌‌ సెంటర్‌‌ నుంచి ఫోన్‌‌ చేసి ఫిర్యాదు దారుల ఒపీనియన్స్​ ​ తీసుకుంటారు. ఆ టైమ్ లో కూడా సిటిజన్స్​ అసహనం వ్యక్తం చేస్తుంటారు. మంత్రులు,ఉన్నతాధికారుల దృష్టికి ట్విటర్  ద్వారా తీసుకెళ్తనే ఫోకస్​ చేస్తుండగా, డైరెక్ట్​గా వచ్చే కంప్లయింట్స్​ని పక్కన పడేస్తున్నారు.

ప్రాబ్లమ్​ ఉందని చెప్పినా..

గ్రేటర్​లో ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్​ సాల్వ్​ చేయాల్సిన అధికారులు, చివరకు ఆఫీసుకు వెళ్లి చెప్పినా కూడా పట్టించుకోవడంలేదు. కంప్లయింట్​ చేసేటప్పుడు ప్రూఫ్ కొరకు ఫొటో తీసి మరి అప్ లోడ్ చేసినా  పరిష్కారం మాత్రం చేయడం లేదు. వాటిపై నిర్లక్ష్యంగా ఉంటుండడంతో ఉన్నవి కాస్తా పెద్దగా తయారవుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీకి వస్తున్న కంప్లయింట్లలో 50 శాతానికి  పెండింగ్ లోనే ఉంటున్నాయి. అన్ని విభాగాలకు డైలీ వేయి దాకా ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి కంప్లయింట్లు వెళ్తున్నాయి. చాలావరకు పెండింగ్​లోనే పెడుతున్నారు.

 అన్నీ పెండింగే..​

గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కి మొత్తం 3, 04 395 కంప్లయింట్స్​ వచ్చాయి. ఇందులో 1,64,881 ఇంకా  పెండింగ్​ లోనే ఉన్నాయి. ప్రధానంగా వెటర్నరీ, ఇంజినీరింగ్​, ఎంటమాలజీ,టౌన్​ ప్లానింగ్​,అర్బన్ బయోడైవర్సిటీ, రెవెన్యూ, పార్కింగ్​, ఫైర్, లేక్స్​, నిర్మాణ వ్యర్థాల కోసం వచ్చిన వాటిలో 70శాతానికి పైగా పరిష్కారం కాలేదు. ఇక పార్కింగ్​,ఫైర్,లేక్స్​,ఆర్టీఐ కోసం వచ్చిన కంప్లయింట్లలో ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు.

కంప్లయింట్​ చేయమని చెబుతూ..

ప్రాబ్లమ్స్​పై కంప్లయింట్​ చేయలంటే 040-–2111 1111 టోల్​ ఫ్రీ  నెంబర్​, డయల్‌‌100, మై జీహెచ్‌‌ఎంసీ యాప్‌‌, ట్విట్టర్‌‌, గ్రీవెన్స్‌‌ రీడ్రెసల్‌‌ సిస్టమ్‌‌, కమిషనర్ పేషీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. సిటిజన్స్​కు కంప్లయింట్​ చేయాలని అధికారులే  చెబుతుండగా,  వచ్చిన వాటిని మాత్రం టైమ్​ పరిష్కరించడం లేదు.

వారం దాటినా వచ్చి చూడలేదు

సిటిజన్స్​ ఎన్నో ప్రాబ్లమ్స్​పై కంప్లయింట్లు చేస్తున్నా అధికారులు పట్టించుకుంటలేరు. ‘మై జీహెచ్ఎంసీ యాప్’ లో ఒక్క స్ట్రీట్​ లైట్స్​ తప్ప మిగతా కంప్లయింట్లను లెక్క చేస్తలేరు.  లంగర్ హౌజ్ లోని నాగపూరి వంశ శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు పెరిగాయని వారం కిందట కంప్లయింట్​ చేశాను. ఇంతవరకు వచ్చి చూడలేదు. అధికారులెవరూ స్పందించలేదు.             – జెన్నా సుధాకర్, బీజేవైఎం సిటీ ఎగ్జిక్యూటివ్​ మెంబర్