PSL 10: ఇహ్సానుల్లా సంచలన నిర్ణయం.. 22 ఏళ్లకే పాకిస్తాన్ సూపర్ లీగ్‌కు రిటైర్మెంట్

పాకిస్థాన్ పేసర్ ఇహ్సానుల్లా సంచలన నిర్ణయం తీసుకొని ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. డబ్బు మోజులో పడి దేశానికి దూరమై చాలామంది క్రికెటర్లు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతుంటే.. ఇహ్సానుల్లా మాత్రం సొంత లీగ్ అయినటువంటి పాకిస్థాన్ సూపర్ లీగ్ ను వద్దనుకున్నారు. మంగళవారం (జనవరి 15) పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. 

సోమవారం(జనవరి 14) జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్ 10 డ్రాఫ్ట్‌లో 22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్లను ఎవరు కొనుగోలు చేయలేదు. గంటకు 150-160 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి భవిష్యత్ స్టార్ గా కితాబులందుకున్నా ఈ యువ క్రికెటర్ ను పక్కన పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇహ్సానుల్లా పాకిస్థాన్ క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పబ్లిక్ న్యూస్‌తో మాట్లాడుతూ.. తాను  ఈ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నదని.. భావోద్వేగాల వలన తీసుకోలేదని తెలిపాడు. 

ALSO READ | Jasprit Bumrah: బుమ్రాను వరించిన ఐసీసీ అవార్డు.. స్మృతి మంధానకు నిరాశ

“నేను ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలని అనుకోవట్లేదు. ఈరోజు నుంచి ఫ్రాంచైజీ క్రికెట్ ను పూర్తిగా బహిష్కరిస్తాను. నేను పాకిస్థాన్ సూపర్ లీగ్ నుండి రిటైర్ అవుతున్నాను. మళ్ళీ ఈ లీగ్ లో కనిపించను. పిఎస్‌ఎల్‌లో ఆడటం ద్వారా కాకుండా దేశవాళీ క్రికెట్‌లో రాణించి  పాకిస్తాన్‌ జట్టులో స్థానం సంపాదించాలనుకుంటున్నాను". అని ఇహ్సానుల్లా తెలిపాడు. పిఎస్‌ఎల్‌-8 సీజన్ లో ముల్తాన్ సుల్తాన్‌ తరపున 22 వికెట్లు తీసి పాకిస్థాన్ జట్టులో స్థానం సంపాదించాడు. 2023లో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు.