మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ ఆటగాడు ఇహ్సానుల్లా జనత్ పై ఐదేళ్ల పాటు నిషేధం పడింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు బుధవారం (ఆగస్ట్ 7) ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం జనత్.. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి క్రికెట్ ఆడకూడదు. ఈ ఏడాది కాబూల్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో బ్యాటర్ జనత్ ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించాడని ఏసీబీ స్పష్టం చేసింది.
జనత్ ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని ఆర్టికల్ 2.1.1ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అతను కూడా ఈ ఆరోపణలను అంగీకరించాడు. జనత్ ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ నౌరోజ్ మంగళ్ తమ్ముడు.26 ఏళ్ల జనత్ అంతర్జాతీయ క్రికెట్ లో మూడు టెస్టు మ్యాచ్‌లు.. 16 వన్డేలు ఆడాడు. చివరిసారిగా ఆఫ్ఘనిస్తాన్ తరపున 2022లో జింబాబ్వేతో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కూడా ఆడాడు. టెస్టుల్లో 110 పరుగులు.. వన్డేల్లో 307 పరుగులు చేశాడు. ఏకైక టీ20లో 20 పరుగులు చేశాడు.
🚨 Ihsanullah Janat Suspended for Five Years Due to Corruption Allegations! pic.twitter.com/KcisJuJbNo
— CricketGully (@thecricketgully) August 7, 2024