IIFL ఫైనాన్స్ మార్చి త్రైమాసికంలో లాభాలు తగ్గాయి. 6శాతం లాభాలు క్షీణించి రూ.431 కోట్లకు చేరుకుంది.ఇటీవల ఆర్థికసేవల సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా.. IIFL ఫైనాన్స్ బంగారు రుణ వ్యాపారంపై ఆంక్షలు విధించడంతో IIFL లాభాలు గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న కంపెనీ రూ. 458 కోట్ల నికర లాభం.. రూ.431 కోట్లకు పడిపోయింది.
మార్చి 4న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ..IIFL ఫైనాన్స్ సంస్థ బంగారు రుణాలను పంపిణీ చేయకుండా నిషేధించింది. బంగారం క్వాలిటీ చెకింగ్ లో తీవ్రమైన వ్యత్యాసాలు చూపుతుందంటూ వచ్చిన ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం పెరిగిందని కంపెనీ తెలిపింది. జనవరి-మార్చి 2024లో IIFL ఫైనాన్స్ మొత్తం ఆదాయం.. రూ. 2వేల 276 కోట్లతో పోలిస్టే రూ. 2వేల 922 కోట్లకు పెరిగిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.
IIFL ఫైనాన్స్ వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో అనేక రకాల రుణాలు, తనఖాలను అందిస్తుంది. ఇది గతేడాది ఈ త్రైమాసికంలో రూ. 2వేల 058 కోట్లనుంచి రూ.2వేల 270 కోట్లకు పెరిగింది.
ఈ క్వార్టర్ ఫలితాల్లో స్థూల నిరర్ధక ఆస్తులు(NPA) మార్చి 2024 చివరి నాటికి 1.8 శాతం నుంచి 2.3 శాతానికి పెరిగాయి.అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికం ముగింపులో నికర NPA లు కూడా 1.1 శాతం నుంచి 1.2 శాతానికి పెరిగాయి.