న్యూఢిల్లీ: ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్) దాని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) విలువ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 28,512 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,499 కోట్లకు పెరిగింది. ఇది వార్షికంగా 25శాతం అధికం. దీనితో కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా నిలిచింది.
సగటు టిక్కెట్ పరిమాణం (లోన్ సైజ్) రూ. 14.26 లక్షలు ఉంది. కార్యకలాపాల ఆదాయం ద్వారా 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,712 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,317 కోట్లకు పెరిగింది. లాభం 32 శాతం పెరిగి రూ. 1,017 కోట్లకు చేరింది. మే 6, 2024 నాటి ఎక్స్ఛేంజ్ రిపోర్టింగ్ ప్రకారం, కంపెనీకి అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్స్ అథారిటీలో 20శాతం కంటే ఎక్కువ వాటా ఉంది.