IIM CAT 2024 : క్యాట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది.. చెక్ చేసుకోండిలా

IIM CAT 2024 : క్యాట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది.. చెక్ చేసుకోండిలా

CAT 2024 ఫలితాలు విడుదలయ్యాయి.క్యాట్ 2024 ఫలితాలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM) ప్రకటించింది. తుది ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను వెలువరించారు. అభ్యర్థులు https://iimcat.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

నవంబర్ 24, 2024న దేశవ్యాప్తంగా 389 సెంటర్లలో CAT 2024 పరీక్ష నిర్వహించారు. నవంబర్ 29 రెస్పాన్స్ షీట్, ప్రొవిజనల్ ఆన్సర్ కీని కోల్ కతా ఐఐఎం విడుదల చేసింది. 

Also Read :- 10 శాతం ఉద్యోగులను తొలగిస్తున్న గూగుల్ సుందర్ పిచాయ్

ఏవైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అభ్యర్థులకు డిసెంబర్ 3నుంచి 5 వరకు సమయం ఇచ్చింది. మూడు సెక్షన్లలో మొత్తం 405 ఆబ్జక్షన్స్ వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత CAT2024 తుది ఫలితాలతో కూడిన ఆన్సర్ కీని విడుదల చేసింది.