ఐఎస్ఏ ఆధ్వర్యంలో స్టీల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా బిల్డ్ సమ్మిట్

ఐఎస్ఏ ఆధ్వర్యంలో స్టీల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా బిల్డ్ సమ్మిట్

హైదరాబాద్: ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాబిల్డ్ రెండో ఎడిషన్ స‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌స్సు శుక్రవారం హైదరాబాద్​లో జరిగింది.  2024 భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెలివరీని వేగవంతం చేయడాన్ని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్కురంగంలో సవాళ్లు, పరిష్కారాలు, పురోగమనాలు, నిర్మాణ,  మౌలిక సదుపాయాలపై ఈ స‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌స్సులో చ‌‌‌‌‌‌‌‌ర్చించారు. స‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌స్సుకు ఉక్కు మంత్రిత్వ శాఖ, వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ల్డ్ స్టీల్ అసోసియేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌ మ‌‌‌‌‌‌‌‌ద్దతు ఇచ్చాయి.

కేంద్ర ప్రభుత్వ ఉక్కు కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ జిందాల్,  సెయిల్​ చైర్మన్​  అమరేందు ప్రకాష్,   జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జయంత్ ఆచార్యతోపాటు. ప్రముఖ బిల్డర్లు, ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌లు, ప్రాజెక్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్  స్ట్రక్చరల్ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌లు   రైల్వేలు, మెట్రో నిర్మాణాలు, వంతెనలు,  విమానాశ్రయాలను నిర్మించే టాప్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కార్యక్రమంలో పాల్గొన్నాయి.