IIT Baba: మొన్న దాడి..ఇప్పుడు జైలు..డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఐఐటీ బాబా అరెస్ట్

IIT Baba: మొన్న దాడి..ఇప్పుడు జైలు..డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఐఐటీ బాబా అరెస్ట్

మహాకుంభమేళా సెలబ్రిటీ..ఐఐటీబాబా అలియాస్ అభయ్ సింగ్ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అభయ్ సింగ్ గంజాయి వంటి డ్రగ్స్ సేవిస్తున్నాడని ఆరోపణ లతో నార్కోటిక్ డ్రగ్స్, సైకోథెరిపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) యాక్టు కింద పలు కేసులు నమోదు చేశారు.  రిద్దిసిద్ది పార్క్ సమీపంలోని క్లాసిక్ హోటల్ లో ఐఐటీ బాబాను షిప్రా పాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ | నీ బూత్ జోకులు ఏమన్నా ప్రతిభ అనుకుంటున్నావా.. యూట్యూబర్ రణవీర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం

గతవారం నోయిడాలోని ఓ ప్రైవేట్ చానెల్ లో ఇంటర్వ్యూ ఇస్తుండగా ఐఐటీ బాబాపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు  చేశారు. దాడికి సంబంధించిన వీడి యోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. అభయ్ సింగ్ (ఐఐటీ బాబా)ను టీవీ ఛానెల్ డిబెట్ లో ఉండగా కొంతమంది ముసుగు ధరించిన వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారు.  బూతులు తిడుతూ, కొట్టారు. ఈ ఘటన తరువాత అభయ్ సింగ్ పోలీసు స్టేషన్ వెలుపల సిట్ నిరసనను వ్యక్తం చేశాడు. 

మహాకుంభమేళా 2025లో ఐఐటీబాబా ఫేమ్ అయ్యారు. తన ఆథ్యాత్మిక ప్రయాణాన్ని, అనుభవాలను , చిన్ననాటి గాయాలను తనను ఎలా ఆథ్యాత్మిక మార్గంలో నడిపించాయో వివరించడం ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. ఇంతలోనే వివాదాలతో  ఐఐటీ బాబాను షిప్రా పాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.