IND vs PAK: ఇండియా ఓడిపోతుందని చెప్పా.. నన్ను క్షమించండి: ఐఐటియన్ బాబా

IND vs PAK: ఇండియా ఓడిపోతుందని చెప్పా.. నన్ను క్షమించండి: ఐఐటియన్ బాబా

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో ఆదివారం (ఫిబ్రవరి ) జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పెద్దగా కష్టపడకుండానే రోహిత్ సేన అలవోక విజయాన్ని అందుకుంది. ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో విజృంభించడంతో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టీమిండియా గెలిచిన తర్వాత ఐఐటియన్ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ ఎదర్కొంటున్నాడు. ఫ్యాన్స్ అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

అసలేం జరిగిందంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగడానికి ముందు ఐఐటియన్ బాబా అభయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఇండియా ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. కుంభమేళాలో ఓ పాడ్‌కాస్ట్‌లో బాబా మాట్లాడుతూ " ‘ఇస్‌ బార్ ఇండియా నహీ జీతేగా. విరాట్ కోహ్లీ ఔర్ సబ్ కో బోల్ దో కీ జీత్ కే దిఖా దే. మైనే బోలా నహీ జీతేగీ ఇండియా తో నహీ జీతేగీ’ (ఈ సారి ఇండియాయ్ గెలవదు. విరాట్ కోహ్లీతో పాటు అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే ) అని కామెంట్స్ చేశాడు. 

పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించడంతో నెటిజన్స్ అతన్ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ట్రోల్స్ చేస్తూ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనొక మోసగాడని కొంతమంది అంటుంటే.. పాడ్‌కాస్ట్‌లకు ఆయనను పిలవడం మానివేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇంకొంతమంది ఆయన జోస్యం చెప్పడం మానివేయాలని, కనిపించకుండా వెళ్లిపోవాలని అభయ్ సింగ్‌కు సూచిస్తున్నారు.

ALSO READ | Champions Trophy: ఆశలు మిగిలే ఉన్నాయి: పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి

తన జోస్యం తప్పు కావడంతో సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై ఐఐటియన్ బాబా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో క్షమాపణలు చెబుతూ ఓ పోస్టు షేర్ చేశారు.  విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను దానికి జోడించారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఏకపక్ష పోరులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 62), మహ్మద్ రిజ్వాన్ (77 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 46), ఖుష్దిల్ షా (39 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 సిక్సర్లతో 38) రాణించారు.అనంతరం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (67 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో  56) మెరుపులతో ఇండియా 42.3 ఓవర్లలోనే 244/4 స్కోరు చేసి గెలిచింది.